ఈ ముగ్గురిలో కామన్‌గా ఉంది ఏంటి?.. ప్రకాష్ రాజ్ ట్వీట్ దుమారం

బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంతో.. ఆయన చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.
ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. నీరవ్ మోదీ లలిత్‌మోదీ మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఉంచి.. తన ట్విటర్ వాల్‌పై పోస్ట్ చేశారాయన.జనరల్ నాలెడ్జ్.. ఈ ముగ్గురిలో కామన్ ఏంటి? జస్ట్ ఆస్కింగ్ #Justasking అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి మద్దతుగానే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులు ఈ ట్వీట్‌పై మండిపడుతున్నారు.
General Knowledge:-
What is common here #justasking pic.twitter.com/HlNCjJejwk— Prakash Raj (@prakashraaj) March 25, 2023
గతంలోనూ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రాజ్ పలు ట్వీట్లు చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మోదీ అనే ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలతోనే రాహుల్ గాంధీపై 2019లో పరువు నష్టం దావా నమోదు కావడం, తాజాగా ఆయనకు గుజరాత్ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం.. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చెలరేగడం తెలిసిందే.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు