
జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గుపాటి క్షమాపణ చెప్పాలని ఆయన ప్యాన్స్ కర్ణాటక, బళ్లారి, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి భారీగా అనంతపురం చేరుకున్నారు.

అయితే, సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన అనుచిత వాఖ్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు.

అయితే, ఈ ఆందోళన కేవలం అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
















