అప్పుడు నేను అల్లు అర్జున్‌లో ఉన్న ఆకలి చూశాను : ప్రకాశ్‌ రాజ్‌

Prakash Raj Sensational Comments On Allu Arjun Getting National Award - Sakshi

పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయిలో అవార్డులను పొందాయి. ఈ ఘనతను పురస్కరించుకుని మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ..

టాలీవుడ్‌లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయం. కానీ.. ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రావడం లేదు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు.

జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదు? బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణం. రాజమౌళి మన తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకువెళితే అది తెలుగు పరిశ్రమకు, తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమా గర్వకారణం. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ కష్టం అలాంటిది.

తను మొదటి సినిమా చేస్తున్నప్పుడు అల్లు అరవింద్‌గారు బన్నీని  ప్రకాశ్‌ రాజ్‌ దగ్గరికి వెళ్లమంటే.. నేను ఇతర సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు అల్లు అర్జున్ వచ్చి ట్రైపాయిడ్‌ కెమెరా దగ్గర కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు నాకు గుర్తున్నాయి. తరువాత మేము గంగోత్రి చిత్రం షూటింగ్‌ చేస్తున్న సమయంలో నేను తన నటన చూసి అల్లు అరవింద్‌తో 'దిస్‌ బోయ్‌ విల్‌ గ్రో' అన్నాను. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ఒక ఉదాహరణగా నిలిచాడు.

నువ్వు ఇప్పుడెలా ఉన్నావనేది కాదు.. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలుంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితే ఈ రోజు బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది. బన్నీకి జాతీయ అవార్డు వస్తే నా బిడ్డకి వచ్చినట్టు భావిసున్నా. నాకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే అక్కడివారు తక్కువగా చూసేవారు. కానీ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు తెలువారికి రావడం చాలా గర్వంగా ఉంది.

మనకి అవార్డు వస్తేనే కాదు మనవాళ్లకి వస్తే కూడా మనకి వచ్చినట్టు. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు కానీ ఇదెందుకు మన సినీ పెద్దలకి రావట్లేదు? మన సినిమాతో బౌండరీస్‌ దాటేస్తున్న సమయంలో అవతలి వాళ్లకంటే మన వాళ్లని మనం గౌరవించకపోతే ఎలా..? అంటూ ప్రకాష్ రాజ్ సినీ పెద్దలను ప్రశ్నించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top