వెండితెరపై డెవిల్ కపుల్స్.. భర్తతో కలిసి దుర్మార్గాలు చేసే భ ‘లేడీ విలన్స్‌’

Special Story On 6 Villain Couples Who Killed With Their Performances In Telugu Movies - Sakshi

విలన్.. హీరోయిన్ వెంట పడ్డాడు. లేకపోతే హీరోతో గొడవ పడ్డాడు. ఏదో ఒకటి. హీరోయిన్  విల న్ అసహ్యయించుకుంటుంది. అతన్ని ఛీ కొడుతుంది. హీరో ఏమో చావకొడతాడు. మూకీ నుంచి టాకీ వరకు ఒకటే స్టోరీ లైన్. విలన్ని చూసి భయపడే ఆడవాళ్లు ఉంటారు. చీదరించు కునే ఆడవాళ్లు ఉంటారు…మరి…విలన్‌కి జోడీ మాటేంటి ? ఈడూ జోడూ అంటే హీరో హీరో యిన్స్ మాత్రమేనా ? ఈ డౌట్ సహజంగా అందరికీ వస్తుంది కదా. ఇంతకీ తెలుగు సినిమాల్లో విలన్ జోడీలు లేరా? చిలకాగోరింకల్లా అనోన్యంగా ఉంటూ…కలిసికట్టుగా దుర్మార్గాలు చేసే డెవిల్ కపుల్స్ మీద ఒక లుక్ వేసేద్దామా..

ఏ సినిమా చూసినా హీరోకే జోడి. అది లవర్ కావచ్చు. లేదా భార్య కావచ్చు. కానీ…విలన్ కి మాత్రం జోడి ఉండదు. హీరోయిన్ చేత ఛీ కొట్టించుకునే విలన్లే అందరూ. ఒకవేళ భార్య రూపం లో జోడి ఉన్నా…ఆమె విలన్ని…విలన్ లానే చూస్తుంది. అలా కాకుండా విలన్ చేసే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసే జోడి ఉంటే ? ఆమె భార్య  కావచ్చు. ప్రేయసి కావచ్చు. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా విలన్‌కి అలాంటి జోడి దొరుకుతూ ఉంటుంది.  అతను చేసే వెధవ పనున్నింటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విలన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. క్రాక్ సినిమా తో మరోసారి ఈ ట్రెండ్ ఫోకస్‌లోకి వచ్చింది. కఠారి కృష్ణకి అన్ని రకాలుగా అండగా ఉండే జయమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది.  ఈ చిత్రంలో కటారి కృష్ణ  పాత్రని సముద్రఖని పోషించగా, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించింది. 

అర్జున్.. ఒక్కడు తర్వాత గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ బ్యాగ్రౌండ్‌లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ సినిమాలో విలన్ బాల నాయ గర్ అయితే, అంతకు మించి అన్న టైప్లో విలనీజాన్ని పండించింది ఆండాల్ పాత్ర. బాల నాయగర్‌గా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణి ఆండాల్‌గా సరిత నటించారు. భర్త మనసు తెలు సుకుని మరీ దుర్మార్గపు పనులు చేసే భార్యగా సరిత నటన ప్రశంసలు అందుకుంది. మహేశ్‌ బాబుతో పాటుగా సరితకు కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 

విలన్‌కి  జోడిగా ఉంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే ఆడవాళ్లు తెలుగు సినిమాల్లో తక్కు వే. మహేశ్‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో అలాంటి క్యారెక్టర్ని డిజై న్ చేశారు. నిజంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సినిమాలో గోపిచంద్‌కి జంటగా రాశి నటించింది. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది.  మల్లి పాత్రలో గ్లామర్‌కి క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. 

సినిమాకి, సినిమాకి పూర్తి భిన్నమైన జానర్స్‌ని ఎంపిక చేసుకునే హీరోల్లో రానా ఒకడు. నేనే రాజు, నేనే మంత్రి అందుకో ఉదాహరణ. జోగేంద్ర, రాధ చూడముచ్చటైన జంట. చివరి వరకు మూవీలో ఈ కపుల్ ట్రావెల్ చేయక పోయినా…కథ మలుపు తిరగడానికి మాత్రం కారణమౌ తుంది. అదే ఊరి సర్పంచ్ జంట. సర్పంచ్‌గా ప్రదీప్ రావత్ నటిస్తే…అతని భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. ప్రదీప్ రావత్, బిందు చంద్రమౌళి ఇద్దరూ నెగిటివ్ రోల్స్‌లో తెగ జీవించేశారు.

ఒక సినిమా. పది విభిన్నమైన క్యారెక్టర్లు. దశావతారంతో నట విశ్వరూపం చూపించేశారు కమలహాసన్. ఒక్కో పాత్ర పూర్తి భిన్నమైన నేపథ్యంతో సాగుతోంది. కథానాయకుడు, ప్రతికథా నాయకుడుతో పాటుగా కథని మలుపు తిప్పే కీలక పాత్రలన్నీ తానే పోషించారు. అందులో విలన్ పాత్ర ఫ్లెచర్‌కి జంటగా మల్లికా షరావత్ నటించింది. గోవింద్‌ని పట్టుకునే క్రమంలో ఫ్లెచర్కి మల్లికా షరావత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది.  

అమ్మోరు. పాతికేళ్ల క్రితమే వి.ఎఫ్.ఎక్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం. అసలే స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ పైన భక్తి చిత్రం. ఒకవైపు భక్తి భావోద్వేగం. మరోవైపు తొలి సారిగా కళ్ల ముందు కనిపిస్తున్న సరికొత్త సాంకేతిక మాయజాలం. అందుకే…అమ్మోరు అం తటి ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చ జరిగే చేసింది. అమ్మోరు చిత్రంలో ప్రధాన విలన్గా గోరఖ్ పాత్రలో రామిరెడ్డి నటించారు. అదే చిత్రంలో మరో విలన్గా బాబూమోహన్ నటించారు. బాబూ మోహన్‌కి జంటగా వడివుక్కరసి నటించారు. హీరో కుటుంబంలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భార్యా, భర్తలిద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య కుట్రల కోణంలో కెమిస్ట్రీ చాలా బాగా పండింది.

టాలీవుడ్‌లో దాదాపు పదేళ్ల పాటు ఏలేసిన హీరోయిన్స్‌గా ఒకరు సిమ్రాన్. సహజంగా హీరో యిన్‌గా ఫేడౌట్ అయిన తర్వాత ఏ వదినగానో, అక్కగానో రీఎంట్రీ ఉంటుంది. కానీ…సిమ్రాన్ మాత్రం లేడీ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ మూవీ సీమరాజా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విలన్ లాల్ భార్యగా నెగివిట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది సిమ్రాన్. హీరోయిన్ సమంతాతో పాటుగా లాల్, సిమ్రాన్ ల విలనీజం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top