Mahesh Babu: SSMB 28 సెట్‌లో సందడి చేయనున్న శ్రీలీల! కొత్త షెడ్యూల్‌ అప్పుడే స్టార్ట్‌

Is Sreeleela Joins In Mahesh Babu, Trivikram SSMB 28 Set Next Schedule - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్‌ టైటిల్‌లో ఈ మూవీ సెట్‌పైకి వచ్చింది. ఇటీవలె హైదరాబాద్‌ రెండవ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తదుపరి అప్‌డేట్‌ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. SSMB 28కు సంబంధించిన నెక్ట్స్‌ షెడ్యూల్‌ రేపటి(ఫిబ్రవరి 28) నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం త్రివిక్రమ్‌ ఓ భారీ సెట్‌ ప్లాన్‌ చేశాడట.

చదవండి: టాలీవుడ్‌ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ భేటీ, చిరు ట్వీట్‌

హైదరాబాద్‌ శివారులోని ఓ ఇంట్లో ఈ మూవీ షూటింగ్‌ జరగనుందట. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌ బాబు హీరోయిన్‌ పూజా హెగ్డే, ప్రకాశ్‌ రాజ్‌తో పాటు యంగ్‌ బ్యూటీ శ్రీలీల కూడా జాయిన్‌ కానుందట. ఇక్కడ హీరోహీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అంతేకాదు ప్రకాశ్‌ రాజ్‌-మహేశ్‌ మధ్య ఉండే సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్‌తో శ్రీలీల SSMB 28 సెట్‌లో తొలిసారి అడుగుపెట్టబోతుంది.

చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్‌ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్‌

కాగా ఇందులో పూజా హెగ్డే ఫిమేల్‌ లీడ్‌ కాగా, శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు మరో బాలీవుడ్‌ నటి ఇందులో సందడి చేయనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సెకండ్ హాఫ్‌లో చాలా కీలకంగా ఉంటుందట. అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనువిందు చేయనుందని టాక్‌. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top