'OG' మూవీలో పవర్‌ఫుల్‌ రోల్‌లో ప్రకాశ్‌ రాజ్‌ | Pawan Kalyan’s OG: Prakash Raj First Look as Satya Dada Unveiled | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ'లో ప్రకాశ్‌ రాజ్‌.. పోస్టర్‌ చూశారా?

Sep 18 2025 2:32 PM | Updated on Sep 18 2025 2:37 PM

Pawan Kalyan OG Movie: Prakash Raj Poster Released

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన యాక్షన్‌ మూవీ ఓజీ (OG Movie). ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి కీలక పాత్ర పోషించారు. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓజీ ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్‌ను పక్కనపెట్టి మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ వదిలింది చిత్రయూనిట్‌. ఓజీలో సీనియర్‌ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) ఉన్నట్లు ప్రకటించింది. 

సత్య దాదాగా ప్రకాశ్‌ రాజ్‌
ఈమేరకు ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రకాశ్‌ రాజ్‌.. శాలువా కప్పుకుని, కళ్లజోడు పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును సత్యదాదాగా ప్రకటించారు. మరి ఆయన క్యారెక్టర్‌ ఏంటనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఇక ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించారు.

 

 

చదవండి: దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి' టీమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement