అర్ధరాత్రి నుంచే ఓటీటీకి ముఫాసా.. ఎక్కడ చూడాలంటే? | Mufasa The Lion King Streaming On this Ott From This Mid night | Sakshi
Sakshi News home page

Mufasa The Lion King: ఓటీటీకి ముఫాసా ది లయన్ కింగ్.. ఎక్కడ చూడాలంటే?

Mar 25 2025 8:03 PM | Updated on Mar 25 2025 8:11 PM

Mufasa The Lion King Streaming On this Ott From This Mid night

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ‍అలరించిన చిత్రం ది లయన్‌ కింగ్‌. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో లయన్ కింగ్‌-2 కూడా వచ్చేసింది.

అయితే గతేడాది లయన్‌ కింగ్‌ ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాను అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ తెరకెక్కించారు. గతేడాది డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. తెలుగులో మహేశ్ బాబు.. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పగా, హిందీలో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

అయితే ముఫాసా: ది లయన్ కింగ్‌ మరికొద్ది గంటల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ అర్ధరాత్రి నుంచే జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. మార్చి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement