
ఇప్పుడంటే కాస్త తగ్గిపోయాయి గానీ అప్పట్లో హాలీవుడ్‌లో సూపర్ హీరో జానర్‌లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ప్రత్యేకించి 'సూపర్ మ్యాన్' ఫ్రాంచైజీ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 1984 నుంచి ఈ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు నెల అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఈ మూవీ సంగతేంటి?
డీసీ యూనివర్స్‌లోని లేటెస్ట్ 'సూపర్ మ్యాన్' సినిమా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే మరీ సూపర్ అనిపించేలా టాక్ తెచ్చుకోలేకపోయింది. మన దేశంలోనూ ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డైరెక్టర్ జేమ్స్ గన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఫాండంగో ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అయితే టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‍పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.
సూపర్ మ్యాన్‌తో పాటు ఈ వారం 30కి పైగా సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, గ్యాంబ్లర్స్, టెహ్రాన్ చిత్రాలతో పాటు సారే జహాసే అచ్చా, అంధేరా లాంటి సిరీసులు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటే ఏమైనా సడన్ సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్‌లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)