
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 30కి పైగా లేటెస్ట్ చిత్రాలు రానున్నాయి. వీటిలో కొన్ని తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఉండగా.. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, సిరీసులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ క్రేజీ సిరీస్ తెలుగు వెర్షన్.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
(ఇదీ చదవండి: శ్రీదేవి జయంతి.. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆ రికార్డ్ ఈమెదే)
హాలీవుడ్‌లో డైనోసార్లు, ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో సినిమాలు, సిరీసులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్నిరోజుల క్రితమే 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్' అనే మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు 'ఏలియన్: ఎర్త్' పేరుతో తీసిన ఓ సిరీస్ సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రావడం విశేషం.
కొన్నాళ్ల క్రితం రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. 2120 సంవత్సరం. భూమ్మీదకు ఏలియన్స్ వస్తారు. మరోవైపు శాస్త్రవేత్తలు వాటిని కట్టడి చేసేందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. మరి ఈ సమరంలో ఎవరు పైచేయి సాధించారు? చివరకు ఏమైందనేదే సిరీస్ స్టోరీలా అనిపిస్తుంది. ప్రస్తుతానికి రెండు ఎపిసోడ్స్‌ని హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అదిరిపోయిందని రివ్యూలు కూడా వస్తున్నాయి. ఆసక్తి ఉంటే ఈ సిరీస్‌పై లుక్కేయండి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
