
టాలీవుడ్‌లో ఇప్పటివరకు వందలాది మంది హీరోయిన్లు వచ్చారు, వస్తూనే ఉన్నారు. కానీ శ్రీదేవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం వేరే లెవల్. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ అతిలోక సుందరి అలా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమైన ఈమె.. ప్రమాదవశాత్తు తనువు చాలించడం మాత్రం ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేని చేదు జ్ఞాపకం. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె సృష్టించిన క్రేజీ రికార్డ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)

1963 ఆగస్టు 13న తమిళనాడులో పుట్టింది శ్రీదేవి. అయితే ఈమె అసలు పేరు ఇది కాదు. శ్రీ అమ్మ అయ్యంగర్. నాలుగేళ్ల వయసులోనే ఓ తమిళ సినిమాలో నటించింది. అప్పుడు తన స్క్రీన్ నేమ్ శ్రీదేవిగా మార్చుకుంది. 1970 నుంచి అయితే వరసగా దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ మూవీస్ చేస్తూనే ఉంది. అలా దాదాపు 200కి పైగా చిత్రాలు చేసి తిరుగులేని హీరోయిన్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'మా బంగారక్క'.. తెలుగులో హీరోయిన్‌గా శ్రీదేవికి తొలి సినిమా. కానీ రాఘవేంద్రరావు తీసిన 'పదహారేళ్ల వయసు' మూవీ ఈమెని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసింది. అక్కడి నుంచి మొదలుపెడితే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అప్పటి స్టార్ హీరోలందరితోనూ శ్రీదేవి వరసపెట్టి సినిమాలు చేసింది. అద్భుతమైన హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది.
(ఇదీ చదవండి: 'తెలుగులో అల్లు అర్జున్'.. జాన్వీ కపూర్ పరమ్ సుందరి ట్రైలర్)

అయితే శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది కదా.. అప్పట్లో పలువురు స్టార్ హీరోలకు మనవరాలు, కూతురిగా చేసిన ఈమె.. పెరిగి పెద్దయిన తర్వాత ఒకరిద్దరు అదే హీరోల పక్కన హీరోయిన్‌గానూ చేయడం విశేషం. ఈ రికార్డ్ ఇప్పట్లో కాదు ఎప్పటికీ ఏ హీరోయిన్ కూడా బ్రేక్ చేయలేరేమో? అంటే ఈ ఘనత మాత్రం ఎప్పటికీ శ్రీదేవి సొంతం.
శ్రీదేవికి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు. కానీ వీళ్లిద్దరూ నటించడం చూడకుండానే శ్రీదేవి మరణించింది. బహుశా ఇదొక్కటే ఈమెకు తీరనిలోటు అని చెప్పొచ్చు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి.. ప్రమాదవశాత్తు మరణిస్తే అదే ఏడాది జూలై ఈమె పెద్ద కూతురు జాన్వీ తొలి సినిమా రిలీజైంది. ఇప్పుడు జాన్వీ.. హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.
(ఇదీ చదవండి: మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్)