
ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న హాలీవుడ్ ఫ్రాంచైజీలలో ట్రాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగంగా ట్రాన్: ఏరిస్ మూవీని తీసుకొస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏఐ టెక్నాలజీ ప్రధానంగా రూపొందించారు. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా లండన్ ప్రీమియర్‌లో జారెడ్ మాట్లాడుతూ... "ఒక విధంగా చూస్తే ఏఐ ఒక పెద్ద సంభాషణగా మారిన సరైన సమయంలో వస్తుంది. మేము ఈ సినిమా పై 9-10 సంవత్సరాల క్రితం పని చేయడం మొదలుపెట్టాం. అప్పుడు ఏఐ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగిస్తున్నారు. వారు తెలిసినా లేదా తెలియకపోయినా, అది మన జీవితాల్లో ఏదో ఒక రూపంలో భాగమైపోయింది. కాబట్టి ఈ సినిమా ఈ సమయంలో వస్తుండటం ఆసక్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను." అని అన్నారు. కాగా. ఈ చిత్రంలో జారెడ్ లెటో, జెఫ్ బ్రిడ్జెస్, గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, జోడి టర్నర్ స్మిత్, కామెరాన్ మోనాఘన్, హాసన్ మిన్హాజ్, గిలియన్ ఆండర్సన్ నటించారు.