
సినీ ప్రియుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న విజువల్ వండర్ అవతార్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2022లో విడుదలైన అవతార్-2.. ది వే ఆఫ్ వాటర్ సైతం ప్రేక్షకులను అలరించింది. ఈ అవతార్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.
దీంతో ఈ ఏడాదిలో మరో సినిమాతో జేమ్స్ కామెరూన్ రెడీ అయిపోయారు. అవతార్ సిరీస్‌లో భాగంగా అవతార్.. ఫైర్ అండ్ యాష్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అవతార్ పార్ట్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ట్రైలర్ చూస్తుంటే మరింత మరో అద్భుతమైన విజువల్ వండర్‌గా రికార్డ్ సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.