
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. హిందీ మూవీస్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ.. టాలీవుడ్లో బద్రిలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లోనూ మెప్పించింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత గదర్-2లో మెప్పించింది. అయితే ఇటీవల ఓ పాడ్కాస్ట్కు హాజరైన అమీషా పటేల్ తన పెళ్లితో పాటు కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాల పంచుకుంది.
అంతేకాకుండా తన క్రష్ గురించి కూడా ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడింది. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తనకు విపరీతమైన ప్రేమ ఉందని అమీషా పటేల్ మనసులోని మాటను బయటపెట్టింది. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే టామ్ క్రూజ్ పట్ల తనకున్న అభిమానాన్ని అమీషా పటేల్ పంచుకోవడం ఇదేం మొదటిసారి కాదు.. 2023లోను తన గదిలో ఆ స్టార్ పోస్టర్లు ఉన్నాయని అమీషా వెల్లడించింది. టామ్‌తో కలిసి పనిచేయాలనేది తన కోరిక అని తెలిపింది.
అమీషా పటేల్ మాట్లాడుతూ.. "నాకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం. మీరు అతనితో పాడ్‌కాస్ట్ చేయగలిగితే.. దయచేసి నన్ను కూడా ఆ పాడ్‌కాస్ట్‌కి పిలవండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్ అంటే ఇష్టం. నా పెన్సిల్ బాక్స్‌లో.. నా ఫైల్స్‌లో అతని ఫోటో ఉండేది. నా గదిలో ఉన్న ఏకైక పోస్టర్ టామ్ క్రూజ్దే. అతను ఎప్పుడు.. ఎప్పటికీ నా క్రష్. నేను అతని కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా వెనకాడను. అతనికి పెద్ద అభిమానిని అని.. అవకాశం ఇస్తే పెళ్లి చేసుకునేదాన్ని" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని..సరైన వ్యక్తి దొరికితే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడతానని కూడా అంటోంది అమీషా పటేల్.
ఇక కెరీర్ విషయానికొస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత అమీషా పటేల్.. గదర్- 2తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆమె చివరిసారిగా 2024లో వచ్చిన తౌబా తేరా జల్వా మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఈ 50 ఏళ్ల బ్యూటీ ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు.