
మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో చిత్రం అలరించేందుకు సిద్ధమైంది. ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ జూలై 25న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో థియేటర్లలోకి రానుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్‌లో ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని నలుగురి పాత్రలపై ఓ లుక్కేద్దాం.
రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ కనిపించనున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్‌కు నాయకుడిగా ఉంటారు. రీడ్ రిచర్డ్స్ తన శరీర ఆకృతి మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సూ స్టార్మ్ (ఇన్విజిబుల్ ఉమెన్)గా వెనెస్సా కిర్బీ కనిపించనుంది. ఆమె క్షిపణుల నుంచి వచ్చే ఇంటర్ డైమెన్షనల్ శక్తి దాడులను నిరోధించేంత శక్తివంతమైన పాత్ర పోషించింది. జానీ స్టార్మ్ (హ్యూమన్ టార్చ్) గా జోసెఫ్ క్విన్ నటించారు. బెన్ గ్రిమ్ (ది థింగ్) పాత్రలో ఎబోన్ మోస్-బచ్రాచ్ కనిపిస్తారు.
కాగా.. ఈ చిత్రానికి మాట్ షాక్‌మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు.