
హాలీవుడ్‌లో సూపర్ హీరో తరహా క్యారెక్టర్స్ ఇప్పుడు బోలెడన్ని కనిపిస్తున్నాయి. అయితే 90స్ కిడ్స్ ఇష్టమైన పాత్ర అంటే చాలామంది చెప్పే పేరు 'సూపర్ మ్యాన్'. 1984 నుంచి ఈ జానర్ మూవీస్.. ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎందులో ఉంది?
(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ))
డీసీ యూనివర్స్‌లోని లేటెస్ట్ మూవీ 'సూపర్ మ్యాన్'. గతనెల 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజైంది. మిగతా వాటితో పోలిస్తే యావరేజ్ టాక్ వచ్చింది. మన దేశంలోనూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజై ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అద్దె విధానంలో తీసుకొచ్చేశారు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఔట్ సైడ్ ఇండియాలో అందుబాటులో ఉంది.
'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‍పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్)