
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ సిసు. ఈ సిరీస్‌లో మరో చిత్రం శిశు.. రోడ్ టూ రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శిశు పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రిలీజ్ చేయనుంది.
కాగా.. జాల్మారి హెలాండర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైక్ గూడ్రిడ్జ్, పెట్రి జోకిరాంటా నిర్మించారు. ఈ చిత్రంలో జోర్మా టొమ్మిలా, రిచర్డ్ బ్రేక్, స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 నవంబర్ 21న భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.