
హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'థండర్ బోల్ట్స్' ఓటీటీలోకి వచ్చేసింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మే 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జేక్ ష్రియర్ (Jake Schreier) దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి న్యూ అవేంజర్స్ (New Avengers) అనే ట్యాగ్‌లన్ ఉండటంతో ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తి పెరిగింది. అవెంజర్స్ లేని సమయంలో దేశాన్ని కాపాడేందుకు వాలంటీనా టీమ్ 'థండర్ బోల్ట్స్'ని రెడీ చేస్తుంది. ఈ పాయింట్‌తోనే సినిమా ప్రారంభమౌతుంది.

'థండర్ బోల్ట్స్: న్యూ అవేంజర్స్' చిత్రాన్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కించారు. మార్వెల్ కామిక్స్‌లోని సూపర్ విలన్‌లు ఒక టీమ్‌గా ఏర్పడటాన్ని ఇందులో చూపిస్తారు. అయితే, సడెన్‌గా జియోహాట్‌స్టార్ ((JioHotstar))లో ఈ చిత్రం ఆగష్టు 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. రెంట్ విధానంలో ఇప్పటికే జూలై 1 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఇతర దేశాల్లోని అభిమానులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఇండియాలోని ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
థండర్ బోల్ట్స్ చిత్రంలో ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, హన్నా జాన్-కామెన్, గెరాల్డిన్ విశ్వనాథన్, లూయిస్ పుల్మాన్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు.