
హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ఇంతకుముందు వచ్చిన కంజురింగ్ ఫ్రాంచైజ్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ ఫ్రాంచైజ్‌లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ది కంజురింగ్: లాస్ట్ రైట్స్. మైఖెల్ చావ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని న్యూ లైన్ సినిమా సమర్పణలో ది సఫ్రాన్ కంపెనీ, యాన్ అటామిక్ మాన్‌స్టర్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ సెప్టెంబర్ 5న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు చిత్ర కింది వివరాలను తెలిపారు.
ఇది 1980–90 మధ్య జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం అని చెప్పారు. ఇంతకుముందు వచ్చిన కంజురింగ్ ఫ్రాంచైజ్‌లో కంటే భారీ బడ్జెట్‌లో రూపొందిన మూవీ అని పేర్కొన్నారు. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథ, కథనాలతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుందన్నారు. ఈ చిత్రాన్ని భారతదేశంలో వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్లం భాషల్లో విడుదల చేస్తోంది.
చదవండి: జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య