‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Avatar: Fire And Ash). సామ్ వర్తింగ్టన్, జో సాల్డానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్, కేట్ విన్సె్లట్ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంగా నటించగా, క్లిఫ్ కర్టిస్, డేవిడ్ థెవ్లిస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జేమ్స్ కామెరూన్, జాన్ లాండౌ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు కొన్ని భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగులో కూడా విడుదలవుతోంది.
కాగా, ఈ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కు సంబంధించి ఇండియాలో ఓ పెద్ద ఈవెంట్‌ను ప్లాన్ చేస్తారట మేకర్స్. మరోవైపు ఇండి యాలో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ప్రదర్శితం కానున్న థియేటర్స్‌లో ‘అవతార్’ ఫ్రాంచైజీ సినిమా అభిమానులు కొందరు ‘అవతార్’ సినిమా లోగోను దీపాల రూపంలో వెలిగించి, హ్యాఫీ ఫీలయ్యారు.
ఇక 2009లో వచ్చిన ‘అవతార్’, 2022లో వచ్చిన ‘అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్) ప్రేక్షకులను మెప్పించి, రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘అవతార్ 3’ రానుంది. అలాగే ‘అవతార్ 4, అవతార్ 5’ చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ కన్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే.


