
అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ఈమేరకు దర్శకుడు అట్లీ అందుకు సంబంధించిన ప్రణాళికలతో అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం AA22XA6 పేరుతో ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్‌కు కూడా పరిచయం చేసేందుకు ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో భాగస్వామ్యం అయింది.
అల్లు అర్జున్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్‌కి చెందిన స్పెక్ట్రల్ మోషన్ సంస్థ ఇప్పటికే పనిచేస్తుంది. ఆపై హాలీవుడ్ చిత్రాలకి పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని మార్కెట్ చేయడానికి హాలీవుడ్ స్టూడియోతో కూడా ఈ మూవీ టీమ్ కనెక్ట్ అయింది. హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్(Connekkt Mob Scene) బన్నీ సినిమా కోసం పనిచేయనుంది. రెండు దశాబ్దాలకు పైగా ఈ సంస్థ అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పవర్ హౌస్‌లా పనిచేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఆ టీమ్ పనిచేయనుంది.

ఈ ఏజెన్సీకి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ 'అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి' తొలిసారి ఇండియాకు వచ్చారు. ముంబైలో అల్లు అర్జున్, అట్లీని ఆమె కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అవతార్, డ్యూన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జురాసిక్ వరల్డ్, బార్బీ వంటి దిగ్గజ చిత్రాల కోసం ఆమె పనిచేశారు. AA22 చిత్రానికి మార్కెటింగ్ పరంగా ఆమె టీమ్ పనిచేయనుంది. అది గేమ్-ఛేంజర్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. హాలీవుడ్ చిత్రాలకు పవర్ హౌస్‌లా అలెగ్జాండ్రా పనిచేస్తుందని ఆమెకు పేరు ఉంది. దీంతో అల్లు అర్జున్ నటించే ఈ సినిమా హాలీవుడ్‌లో విడుదల కావాడం ఖాయం అని చెప్పొచ్చు.