
ప్రపంచవ్యాప్తంగా యానిమే చిత్రాలు, సిరీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జానర్‌లో లేటెస్ట్‌గా రాబోతున్న సినిమా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్'. వచ్చే నెల అంటే సెప్టెంబరు 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ సమ్మె.. ‘మెగా’ ప్రయత్నం ఫలించేనా?)
కథ విషయానికి వస్తే.. టాంజిరో కామాడో అనే పిల్లోడి ఫ్యామిలీని ఓ రాక్షసుడు చంపేస్తాడు. అతని చెల్లెలు నెజుకో రాక్షసిగా మారుతుంది. ఆమెను మళ్లీ మాములు మనిషిలా తిరిగి మార్చాలనే సంకల్పంతో టాంజిరో డీమన్ స్లేయర్ కార్ప్స్‌లో చేరతాడు. ఈ సిరీస్, మనుషులు, రాక్షసుల మధ్య జరిగే విషాదగాథ, కత్తి యుద్ధాలు, ఆకట్టుకునే కారక్టర్స్, కామెడీ సీన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని జపాన్ మరియు కొన్ని ఆసియా దేశాల్లో తప్ప ప్రపంచవ్యాప్తంగా క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు రిలీజ్ చేయనున్నారు.
(ఇదీ చదవండి: నందమూరి కుటుంబంలో విషాదం)