
నందమూరి ఇంట విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె ఈ తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన చెల్లెలు ఆపై హీరో నందమూరి చైతన్య కృష్ణకు తల్లి అని తెలిసిందే.
సుమారు రెండేళ్ల క్రితం చైతన్యకృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తన తండ్రి జయకృష్ణ నిర్మిచారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 5 లక్షలు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.