హాలీవుడ్ సైంటిఫిక్ హారర్ మూవీ ఇండియన్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. డాన్ ట్రాచెన్‌బర్గ్ (Dan Trachtenberg) దర్శకత్వం వహించిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ (Predator: Badlands) ఇండియాలో రిలీజ్కు సిద్ధమైంది. హాలీవుడ్లో సత్తాచాటిన ఈ సినిమా నవంబర్ 7న మన థియేటర్లలో సందడి చేయనుంది. ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది.
దర్శకుడు ట్రాచెన్‌బర్గ్ ఈసారి ప్రెడేటర్ యూనివర్స్‌ను మునుపెన్నడూ లేని విధంగా తెరకెక్కించారు. కేవలం సర్వైవల్ గేమ్‌కు పరిమితం కాకుండా.. ప్రెడేటర్ హంట్ వెనుక ఉన్న లెజెండ్, యాట్జుజా కల్చర్, కోడ్ ఆఫ్ హానర్ లాంటి లోతైన కథాంశాలను డీల్ చేయడం ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని ఇస్తోంది. అంతేకాకుండా డిమిట్రియస్ షస్టర్-కొలోమాటాంగీ, ఎల్లె ఫ్యానింగ్ జోడీ కెమిస్ట్రీ ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఏలియన్ హంట్ ఉద్రిక్తత మధ్యలో కూడా వారి మధ్య కనిపించే మానవత్వం, ఫ్రెండ్‌షిప్, హ్యూమర్ సినిమాకు సరికొత్త ఫీల్ తెచ్చేలా కనిపిస్తోంది. డాన్ ట్రాచెన్‌బర్గ్ సృష్టించిన ఈ ఎమోషనల్ అడ్వెంచర్ హంట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలంటే నవంబర్ 7 వరకు వేచి చూడాల్సిందే.


