ఫార్ములా–1 రేస్‌.. తెలుగులో కూడా విడుదల | Hollywood F1: The Movie Releasing In Telugu, Check Out Release Date Inside | Sakshi
Sakshi News home page

ఫార్ములా–1 రేస్‌.. తెలుగులో కూడా విడుదల

Jun 19 2025 10:41 AM | Updated on Jun 19 2025 11:03 AM

Hollywood Movie F1 release Date Leaked

హాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఎఫ్‌–1' భారీ అంచనాల మధ్య ఈనెల 27న దేశ వ్యాప్తంగా విడుదల. ఫార్ములా–1 అనగానే ప్రేక్షకుల మదిలో మెలిగేది కారు రేస్‌ల నేపథ్యంలో సాగే కథా చిత్రం అనే ఉంటుంది.  ఒళ్లు గగుర్పొడిచే కార్‌ రేస్‌ల నేపథ్యంలో రూపొందిన చిత్రం ఎఫ్‌–1. జోసెఫ్‌ కొసిన్స్కి కథ, దర్శకత్వం వహించారు. ఆపై నిర్మాణంలో భాగం పంచుకున్నారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా బ్రాడ్‌పిట్‌ నటించారు. ఈ చిత్రాన్ని ఆపిల్‌ ఒరిజినల్‌ ఫిల్మ్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌,  ప్లాన్‌బీ ఎంటర్‌టైమెంట్‌, డాన్‌ అపోలో ఫిల్మ్‌స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 

 మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు జోసెఫ్‌ కొసిన్స్కి పేర్కొంటూ ఇది యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ చిత్రం అన్నారు. అకాడమీ అవార్డు గ్రహీత బ్రాడ్‌పిట్‌ను ఈ చిత్రంలో నటింపజేయడానికి తాను ఆయన్ని సంప్రదించగా చిత్రంలోని తన పాత్రకు అవసరమైన విధంగా ఆయన మారారన్నారు. బ్రాడ్‌ పిట్‌ నిర్మాత కూడా కావడంతో చిత్రంలోని ప్రతి అంశంలోనూ అవగాహనతో కూడిన నటనను ప్రదర్శించారని చెప్పారు. బ్రాడ్‌పిట్‌ ఇందులో నటించడానికి అంగీకరించకుంటే ఇది ఎప్పటికి పూర్తి అయ్యేదో తెలియదని దర్శకుడు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement