
ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సినిమాలకు పెద్ద సంఖ్యలో ఆడియన్స్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ చిత్రాలకు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో సుమారు 15 ఏళ్ల తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగాన్ని తెరకెక్కించారు. మే 15న భారత్‌లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ భయపెట్టేసింది.
అయితే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియా ఫ్యాన్స్‌కు మాత్రం వీక్షించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో ఓటీటీలో ఫైనల్ డెస్టినేషన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇండియా ఫ్యాన్స్ కోసం జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి తెలుగు ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కాగా.. రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్‌వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్ తదితరులు నటించారు. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది.