ఓటీటీలు వచ్చాక మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు మలయాళ మూవీస్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మరో చిత్రం సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. మలయాళంంలో హిట్ అయిన కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీలో సందడి చేయనుంది.
సెన్నా హెగ్డే దర్శకత్వంలో వచ్చిన అవిహితం అనే బ్లాక్ కామెడీ మూవీ జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 14 నుంచి మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఉన్నిరాజ్, రెంజి కంకోల్, వినీత్ చాక్యార్, రాకేష్ ఉషార్, ధనేష్ కోలియత్, అజిత్ పున్నద్, బృందా మీనన్ కీలక పాత్రలు పోషించారు.
Avihitham – Not just a man’s right.
Streaming exclusively on JioHotstar from November 14th.#Avihitham #AvihithamOnHotstar #Comedy #Family #Drama #JioHotstar #JioHotstarMalayalam pic.twitter.com/ZikNnucPFg— JioHotstar Malayalam (@JioHotstarMal) November 7, 2025


