
హేయ్ కిడ్స్...జియో స్టార్ లో ఓ సూపర్ మూవీ వచ్చిందోచ్. అదే లిలో & స్టిచ్. ఇదో సైంటిఫిక్ కామెడీ మూవీ. ఎర్త్ కి దూరంగా ఓ ప్లానెట్ లో ఏలియన్స్ ఓ ఎక్సపరిమెంట్ చేస్తుంటారు. దాంట్లో 626 అనే సూపర్ పవర్స్ ఉన్న ఏలియన్ ను క్రియేట్ చేస్తారు. అయితే యాక్సిడెంటల్ గా ఆ 626 ఏలియన్ ఎర్త్ మీద పడుతుంది. అది కూడా సరిగ్గా లిలో అనే పాప ఇంటి దగ్గర పడుతుంది. ఏలియన్ ప్లానెట్ హెడ్ ఈ 626 ని ఎర్త్ నుండి తీసుకురావడానికి మరో రెండు ఏలియన్స్ ని భూమి మీదకు పంపిస్తారు.
అయితే ఈ లోపు పేరెంట్స్ ,ఫ్రెండ్సూ లేని లిలో కి 626 దొరికి మంచి ఫ్రెండ్ అవుతుంది.లిలో దానికి స్టిచ్ అని పేరు పెడుతుంది. లిలో & స్టిచ్ చేసే అల్లరి ఈ సినిమాలో సూపర్ హైలైట్. మరీ ముఖ్యంగా స్టిచ్ చేసే అల్లరి మిమ్మల్ని గిలిగింతలు పెట్టిస్తుంది. స్టిచ్ ని ఎత్తుకెళ్ళడానికి వచ్చిన ఇద్దరు ఏలియన్లు మనుషుల్లా మారి చేసే అల్లరి ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇంకో సూపర్ విషయం ఏంటో తెలుసా, ఈ సినిమాని రూ. 10 కోట్లు పెట్టి తీస్తే వచ్చిన వందల కోట్ల లాభాలు వచ్చాయి. సో కిడ్స్..హావ్ ఎ నైస్ జర్నీ విత్ లిలో & స్టిచ్ ఆన్ జియో స్టార్.
- హరికృష్ణ ఇంటూరు