నిజ జీవితాల ఆధారంగా... | Game of Change Release on 14th May | Sakshi
Sakshi News home page

నిజ జీవితాల ఆధారంగా...

May 9 2025 4:02 AM | Updated on May 9 2025 4:39 AM

Game of Change Release on 14th May

నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంలో (5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం) భారతదేశంలో జరిగిన కొన్ని నిజ జీవిత కథనాలతో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఆఫ్‌ చేంజ్‌’(Game of Change). బ్లెర్‌ సింగర్, సిద్ధార్థ్‌ రాజశేఖర్, సురేంద్రన్‌ జయ శేఖర్, దినాజ్‌ వేర్వాట్వాల, ఆదిత్య, సోనియా శర్మ, గీతా మిక్కిలినేని, హరీష్, ప్రియాదావే ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళ దర్శకుడు సిధిన్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు సిధిన్‌ మాట్లాడుతూ– ‘‘సాధారణమైన క్షణాలను అసాధారణమైన మార్పులుగా రేకెత్తించిన పలువురు వ్యక్తుల నిజ జీవిత కథనాలను మిళితం చేసి, రూపొందించిన చిత్రం ఇది’’ అని తెలిపారు. ‘‘నేను ఇంగ్లిష్‌లో రాసిన ‘యు కెన్‌ కోచ్‌’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయింది. ప్రస్తుతం సినిమాపై ఆసక్తితో ‘గేమ్‌ ఆఫ్‌ చేంజ్‌’ సినిమాతో నిర్మాతగా, నటుడిగా మారాను’’ అని పేర్కొన్నారు సిద్ధార్థ్‌ రాజశేఖర్‌. ‘‘గేమ్‌ ఆఫ్‌ చేంజ్‌’ లాంటి సినిమా కథ ఇండియన్‌ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాలేదు. ప్రేక్షకుల్లో దేశభక్తిని ఉప్పొంగించే చిత్రం ఇది. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement