సూపర్ హీరో సినిమాలు అనగానే హాలీవుడ్‌లో మార్వెల్, డీసీ యూనివర్స్‌లే గుర్తొస్తాయి. కొన్నేళ్ల ముందు వరకు వీటి నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిత్రాలైతే వస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలా ఈ ఏడాది జూలైలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరోల మూవీ 'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్'. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ అయింది.
జూలై 25న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఎందుకనో పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. కొన్నిరోజుల ముందు రెంట్ విధానంలో ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఉచితంగానే నవంబర్ 5 నుంచి హాట్‌స్టార్‌లోకి రాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఒకవేళ సూపర్ హీరో జానర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ట్రై చేయండి.
(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?)
'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్' విషయానికొస్తే.. రీడ్ రిచర్డ్ (పెడ్రో పాస్కల్), స్యూ స్ట్రామ్ (వన్నెసా), జానీ స్ట్రామ్ (జోసెఫ్ క్విన్), బెన్ (మోస్ బాక్రాక్).. ఓ జట్టుగా ఉండే వీళ్లు ఆస్ట్రోనాట్స్. అందరూ వీళ్లని ఫెంటాస్టిక్ ఫోర్ అని పిలుస్తుంటారు. భూమిని ఎప్పుడూ కాపాడటమే వీళ్ల పని. స్యూ ప్రెగ్నెంట్ కావడంతో ఈమెకు పుట్టబోయే బిడ్డకు కూడా సూపర్ పవర్స్ వస్తాయా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో గలాక్టస్ (రాల్ఫ్ ఇన్నేసన్) భూమిని అంతం చేయబోతున్నాడని తెలుస్తుంది. దీంతో ఇతడికోసం ఫెంటాస్టిక్ ఫోర్ వేట మొదలుపెడతారు.
స్యూకి పుట్టబోయే బిడ్డని తనకు ఇస్తే.. భూమిని, మనుషుల్ని విడిచిపెడతానని గలాక్టస్ చెబుతారు. అప్పుడు స్యూ ఏం చేసింది? భూమ్మీదకు వచ్చిన గలాక్టస్‌ని ఫెంటాస్టిక్ ఫోర్ ఏం చేసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. ఓటీటీ రివ్యూ)


