
బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్బాస్. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఈ బిగ్‌బాస్ సీజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆదివారం హిందీ బిగ్బాస్ సీజన్-19 గ్రాండ్గా మొదలైంది. ఈ సీజన్‌లో పలువురు కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.
బిగ్బాస్ మొదలైందంటే చాలు అందరి దృష్టి కంటెస్టెంట్ ఎవరనే దానిపై ఉంటుంది. అంతేకాకుండా కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ జరుగుతుంది. అయితే గతంలో నాలుగో సీజన్లో అడుగుపెట్టిన హాలీవుడ్ బ్యూటీ పమేలా అండర్సన్ పారితోషికంపై తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ సీజన్‌లోనే అత్యధిక పారితోషికం అందుకుంటోన్న కంటెస్టెంట్‌గా నిలిచింది. హౌస్‌లో హాలీవుడ్ గ్లామర్ తీసుకొచ్చిన పమేలా.. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మొట్టమొదటి అంతర్జాతీయ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె స్పెషల్ గెస్ట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది.
కళ్లు చెదిరే రెమ్యునరేషన్..
అయితే హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో బిగ్బాస్లో అడుగుపెట్టిన పమేలా అండర్సన్ ఏకంగా రెండున్నర కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు రోజులు మాత్రమే హౌస్లో ఉన్న పమేలా ఒక్కో రోజుకు దాదాపు రూ.83 లక్షలుగా తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్గా నిలిచింది. కాగా.. హాలీవుడ్కు చెందిన పమేలా అండర్సన్ 1990ల్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బార్బ్ వైర్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్, సిటీ హంటర్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది.