-
నేకెడ్ గన్ రీమేక్‌లో...
హాలీవుడ్ హాట్ తార పమేలా ఆండర్సన్ అభిమానులకు ఓ శుభవార్త. ఈ గ్లామరస్ స్టార్ తాజాగా ‘నేకెడ్ గన్’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాల్లోకన్నా ఈ చిత్రంలో పమేలా పాత్ర నిడివి ఎక్కువ కావడం, హీరోయిన్ పాత్ర కావడం అనేది అభిమానులు ఆనందించే విషయమే. 1980 చివర్లలో 1990 ఆరంభంలో వచ్చిన క్రైమ్ కామెడీ ‘నేకెడ్ గన్’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మూడో భాగం 1994లో వచ్చింది. 30 ఏళ్లకు ‘నేకెడ్ గన్’ మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అకీవా షాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రీమేక్‌లో లీడ్ రోల్లో లియామ్ నీసన్ నటించనుండగా, అతని సరసన పమేలా ఆండర్సన్ నటించనున్నారు. గత మూడు భాగాల్లో డిటెక్టివ్ పాత్రను లెస్లీ నీల్సన్ చేయగా అతని ప్రేయసిగా ప్రిసిల్లా ప్రెస్లీ నటించారు. రీమేక్‌లో డిటెక్టివ్‌గా లియామ్ నీసన్, అతని ప్రేయసిగా పమేలా ఆండర్సన్ నటించనున్నారు. వచ్చే ఏడాది జూలై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక పమేలా గురించి చె΄్పాలంటే... 1990లలో హాటెస్ట్ స్టార్ అంటే పమేలానే. ‘ప్లే బాయ్’ మ్యాగజీన్ మోడల్‌గా అప్పట్లో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారామె. అలాగే బుల్లితెర కోసం ‘బేవాచ్’ సిరీస్ (1992–1997)లో చేసిన సీజే పార్కర్ పాత్ర కూడా హాట్ స్టార్‌గా పమేలాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాల పరంగా ‘రా జస్టిస్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్’ వంటివి పమేలా క్రేజ్ కొనసాగడానికి ఉపయోగపడ్డాయి. -
ఆమెపై సామూహిక అత్యాచారం.. బిగ్‌బాస్ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!
తెలుగుతో పాటు అన్ని భాషల్లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సీజన్-7 విజయవంతంగా నడుస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త పోకడలతో అభిమానులను అలరిస్తోంది. ఇంతలా ఆదరణ పొందిన రియాలిటీ షో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు సైతం మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ షో ద్వారానే కొందరు సినీరంగంలో ఫేమస్ అవుతున్నారు. అయితే ఈ షోలో పాల్గొనే వారికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అన్న విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారు: శుభ శ్రీ) మన తెలుగు బిగ్‌బాస్ షో అయితే కంటెస్టెంట్స్ పారితోషికాల గురించి మనం లక్షల్లోనే వింటుంటాం. అంతే కాదు.. ఎలిమినేట్ అయినవారు సైతం తమ రెమ్యునరేషన్ గురించి ఇంటర్వ్యూల్లోనూ ప్రస్తావించారు. అయితే లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకున్న కంటెస్టెంట్స్ చాలామందే ఉన్నారు. మరీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న వారు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అబ్బే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కోట్లలో ఇస్తారా? అని అంటారా?.. కానీ కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న వారు కూడా ఉన్నారు. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ కేవలం 3 రోజులకే రూ. 2 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇంతకీ ఎవరో తెలుసుకుందాం. హిందీలో బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ సీజన్-4లో హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. కేవలం మూడు రోజులు మాత్రమే అతిథిగా ఇంట్లో ఉండిపోయింది. ఈ షోలో పాల్గొన్నందుకు ఆమెకు దాదాపు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సీజన్‌తోనే సల్మాన్ ఖాన్ మొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమె తర్వాత అత్యధికంగా బిగ్ బాస్ -15 విజేత తేజస్వి ప్రకాశ్‌కు 1.7 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించారు. కాగా.. పమేలా ఆండర్సన్ కెనడియన్-అమెరికన్ నటిగా, మోడల్‌గా గుర్తింపు దక్కించుకుంది. ప్లేబాయ్ మ్యాగజైన్లో తన మోడలింగ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ సిరీస్ బేవాచ్‌లో సీజే పార్కర్ పాత్రతో ఆమె ఫేమస్ అయింది. (ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే పమేలా తన బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. 2014లో ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 6 నుంచి 10 వయస్సులో ఓ మహిళ తనను వేధించిందని.. ఆ తర్వాత 12 ఏళ్లకే 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడని వివరించింది. అంతే కాదు.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని పేర్కొంది. ఆమెకు 14 ఏళ్ల వయసులో తన ప్రియుడితో పాటు, అతని ఫ్రెండ్స్ ఆరుగురు అత్యాచారం చేశారని వెల్లడించింది. -
ఒకటి కాదు, రెండు కాదు.. ఐదోసారి విడాకులకు సిద్ధమైన నటి!
ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటివరకు ఆమె ఏకంగా నాలుగుసార్లు విడాకులు తీసుకుంది. అంతేకాదు ఇప్పుడు ఐదో భర్తకు విడాకులిచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆవిడెవరో కాదు.. హాలీవుడ్ నటి పమేలా అండర్సన్. 54 ఏళ్ల వయసున్న పమేలా అండర్సన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకోగా అవి పెటాకులయ్యాయి. ఆ తర్వాత 2020లో ఐదో పెళ్లి చేసుకుందీ నటి. కరోనా వల్ల విధించిన లాక్డౌన్లో తన బాడీగార్డ్ డాన్ హేహస్ట్కు దగ్గరైంది. ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వివాహ బంధంతో కలకాలం కలిసుందామనుకున్నారు. అలా లాక్‌డౌన్‌లోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ వీరికి కాలం కలిసిరానట్లు కనిపిస్తోంది. పెళ్లై ఏడాది తిరగకముందే దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా పమేలా అండర్సన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె 1995లో టామీ లీని తొలిసారిగా పెళ్లాడింది. వీరికి బ్రాండన్, డైలాన్ అని ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2006లో సంగీతకారుడు కిడ్ రాక్‌ను పెళ్లాడింది కానీ ఈ బంధం కూడా నిలవలేదు. 2014లో రిక్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఓ షోలో ప్రకటించింది పమేలా. అయితే ఈ సంతోషం కూడా ఆమెకు ఎక్కువ కాలం నిలవలేదు. ఆ మరుసటి ఏడాదే ఇద్దరూ విడిపోయారు. 2020లో నిర్మాత జాన్ పీటర్స్‌ను సీక్రెట్‌గా పెళ్లాడగా కొద్ది రోజులకే అది కూడా పెటాకులైంది. అదే ఏడాది డిసెంబర్లో బాడీగార్డ్ డాన్‌తో వైవాహిక బంధాన్ని ఆరంభించిన పమేలా ఇప్పుడు దాన్ని కూడా తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడటం గమనార్హం. -
బాడీగార్డును పెళ్లి చేసుకున్న స్టార్ నటి
‘బేవాచ్’ సీరియల్ ద్వారా కుర్రకారును వెర్రెక్కించిన హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ లాక్డౌన్లో తన బాడీగార్డును పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గతేడాది ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొద్ది రోజులకే అతడికి దూరంగా ఉంటున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఆమె లాక్డౌన్లో తన బాడీగార్డు డాన్ హేహర్ట్స్ను కెనడాలోని తన వ్యాన్కౌవేర్ ఐలాండ్‌లో వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఆమెకు ఇది ఆరోవ వివాహం. గతేడాది రహస్య వివాహం చేసుకున్న పమేలా అండర్సన్(53) వెడ్డింగ్ ఫ్రాక్‌లో తన భర్త డాన్‌తో కలిసి ఉన్న పెళ్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేగాక తాను సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఇందుకోసం తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: పెళ్లయిన 12 రోజులకే భర్తకు గుడ్‌బై చెప్పిన నటి!) ‘కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో నేను డాన్ హేహర్డ్స్తో ప్రేమలో పడ్డాను. దీంతో అతడిని వివాహం చేసుకున్నాను. నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి చేతిలో ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను. అతడితో కలిసి ఉన్న ఈ ఒక్క ఏడాది నాకు ఏడు జన్మల బంధంగా అనిపిస్తోంది’ అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చారు. కాగా పమేలా, డాన్‌ను తమ చర్చి పాస్టర్స్, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో క్రిస్టియన్ సంప్రాదాయంలో గతేడాది పెళ్లి చేసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కాగా జనవరి 2020లో ప్రముఖ నిర్మాత జాన్ పిటర్స్ను అయిదవ వివాహం చేసుకున్న పమేలా 12 రోజులకే అతడికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి అందిరిని షాక్‌కు గురిచేశారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ఏడాది తర్వాత తన బాడిగార్డును వివాహం చేసుకున్నట్లు ప్రకటించి మరోసారి షాక్ ఇచ్చారు. (చదవండి: ఐదోసారి పెళ్లిచేసుకున్న నటి!) View this post on Instagram A post shared by Pamela anderson fan page (@pamanderson2020) -
అయ్యో.. ఐదో పెళ్లి కూడా పెటాకులేనా!
‘బేవాచ్’ సీరియల్ స్టార్ పమేలా ఆండర్సన్ ప్రముఖ నిర్మాత జాన్ పీటర్స్‌ను ఇటీవల వివాహమాడిన సంగతి తెలిసిందే. వారి పెళ్లి విషయం తెలిసి హాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. కారణం వారి వయసుతో పాటు పమేలాకు ఇది వరకే నలుగురితో వివాహం జరిగింది. మాజీ ప్రేమికులైన వీరిద్దరూ జనవరి 20న పెళ్లి చేసుకోవడంతో హాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పటికీ వారి పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా ఉన్న తరుణంలో ఈ కొత్త జంట అందరికీ మరో షాకిచ్చింది. తన భర్త జాన్ నుంచి విడిగా ఉంటున్నట్లు తాజాగా పమేలా ప్రకటించడంతో అందరూ కంగుతిన్నారు. ఏమైందా అని జుట్టు పీక్కుంటున్నారు. (చదవండి: ఆమెకు ఐదు, ఆయనకు ఆరో పెళ్లి) ఈ విషయంపై పమేలా వివరణ ఇస్తూ.. ‘జీవితంలో ఒకరి నుంచి ఒకరం ఏమి కోరుకుంటున్నామనేది తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ఈ విషయంపై స్పష్టత కోసమే కొంత కాలం దూరంగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు. కాగా వారి వివాహ సర్టిఫికేట్ కూడా ఇంకా దరఖాస్తు చేసుకోకపోవడంతో జాన్, పమేలాలు శాశ్వతంగా విడిపోయారేమోనని హాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. జాన్ పీటర్స్, పమేలాలు 30 ఏళ్ల క్రితం ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 74 ఏళ్ల జాన్ తన పాత ప్రియురాలు పమేలాను ఆరవ వివాహం చేసుకున్నాడు. అయితే పమేలాతో విడిపోవడంపై జాన్ ఇంతవరకు స్పందించలేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement