ఐదోసారి పెళ్లిచేసుకున్న నటి!

Pamela Anderson Marries Producer Jon Peters For Fifth Time - Sakshi

లాస్‌ ఏంజెలెస్‌: ఆమెకు 52 ఏళ్లు, ఆయనకు 74 ఏళ్లు. ఆమె ఒకప్పుడు ‘బేవాచ్‌’ సీరియల్‌ ద్వారా కుర్రకారును వెర్రెక్కించిన పమేలా ఆండర్సన్‌. ఆయన బ్యాట్‌మేన్, ఫ్లాష్‌డాన్స్‌ చిత్రాల ద్వారా ప్రముఖ హాలివుడ్‌ నిర్మాతగా గుర్తింపు పొందిన జాన్‌ పీటర్స్‌. ఆమెకు ఐదో పెళ్లి. ఆయనకు ఇది ఆరో పెళ్లి. ఇద్దరు కలిసి లాస్‌ ఏంజెలిస్‌లోని మాలిబు పట్టణంలో సోమవారం నాడు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇరువురి పిల్లలు కూడా ఆ పెళ్లికి హాజరయ్యారని ‘ది హాలివుడ్‌ రిపోర్టర్‌’ వెబ్‌సైట్‌ బుధవారం వెల్లడించింది.

వారిద్దరికి 35 ఏళ్ల క్రితమే పరిచయం. ‘ప్లేబాయ్‌ మాన్షన్‌’ పమేలా ఆండర్సన్‌ను మొదటి సారి చూడగానే జాన్‌ పీటర్స్‌ మనసు పారేసుకున్నారట. అప్పుడే వారు డేటింగ్‌ కూడా చేశారు. వారిద్దరికి పెళ్లవుతోందని హాలివుడ్‌ చెవులు కొరుక్కుంది. అయినా ఎందుకో వారు విడిపోయారు. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. పమేలా ఇంతకుముందు పెళ్లి చేసుకున్న నలుగురిలో మాజీ భర్తలు టామ్మీ లీ, కిడ్‌ రాక్, రిక్‌ సాలోమన్‌లు సెలబ్రిటీలే. తాను మాత్రం 35 ఏళ్లుగా పమేలా కోసం ఎదురు చూస్తూనే ఉన్నానని, ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరిందని జాన్‌ పీటర్స్‌ వ్యాఖ్యానించారు. ఆమెలో ఓ నటిగా ఎంతో టాలెంట్‌ ఉందని, ఆ విషయం ఆమెకే తెలియదని ఆయన అన్నారు.

‘జాన్‌ ఈజ్‌ ది ఒరిజనల్‌ బ్యాడ్‌ బోయ్‌ ఆఫ్‌ హాలివుడ్, నో వన్‌ కంపేర్స్, ఐ లవ్‌ హిమ్‌ డీప్లీ లైక్‌ ఫ్యామిలీ’ అంటూ జాన్‌ పీటర్స్‌పై పమేలా ఓ కవితను చదవి వినిపించారు. పమేలాకు మొదటి భర్త రాక్‌ స్టార్‌ కాగా, మొన్నటి వరకున్న భర్త స్టాకర్‌ స్టార్‌ అడిల్‌ రామి. ఆమెకు ఇద్దరు మగ పిల్లలుండగా, పీటర్స్‌కు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వారంతా వారి పెళ్లికి హాజరయ్యారట. జాన్‌ పీటర్స్‌ ప్రముఖ హాలీవుడ్‌ నటి క్యాథరినా జెటా జోన్స్‌తో కూడా శృంగారం నడిపినట్లు అప్పట్లో వార్తులు గుప్పుమన్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top