సైన్స్ ఫిక్షన్ జానర్‌లో అత్యంత భయానకమైన పాత్రల్లో 'ప్రెడేటర్' ఒకటి. గత నాలుగు దశాబ్దాలుగా ఈ తరహా సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ జీవి, అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.
(ఇదీ చదవండి: 'జట్టు పట్టుకుని నేలకేసి'.. మాధురికి క్లాస్ పీకిన నాగార్జున)
ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న కొత్త సినిమా 'ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్'. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. 1987లో తొలి మూవీ రిలీజ్ కాగా.. తర్వాత 1990, 2010, 2022ల్లో సినిమాలు వచ్చాయి. మరి ఇప్పుడు రాబోతున్న చిత్రం ఎలా అలరించనుందో చూడాలి?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)


