బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ వచ్చిందంటే చాలు మిగతా రోజుల కంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. ఆ వారమంతా చేసిన తప్పులు, గొడవల గురించి మాట్లాడుతూ ఆయా కంటెస్టెంట్స్‌కి ఇచ్చి పడేస్తుంటాడు. ఈసారి అలా మాధురికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఈ వారం టాస్క్‌ల్లో భాగంగా ఇలా గనక బయట ప్రవర్తించుంటే జట్టు పట్టుకుని నేలకేసి కొడతా అని రీతూపై మాధురి కామెంట్ చేసింది. అనుకున్నట్లుగానే ఈవారం ఆ మాటలకు సంబంధించిన పంచాయతీ నాగార్జున దగ్గరకు వచ్చింది. అయితే ఈసారి హౌస్‌లో పక్కనే బోర్డుపై ఉన్న ట్యాగ్స్‌లో ఏది సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున సూచించాడు. తొలుత రమ్య.. 'ఫేక్ బాస్' అనే ట్యాగ్ తీసుకొచ్చి మాధురి మెడలో వేసింది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు బంధాలేంటి అని కామెంట్ చేసి ఇప్పుడు బంధాల్లోకి వెళ్తున్నట్లు అనిపించిందని రమ్య చెప్పింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)
రీతూ అయితే మాధురి గురించి నాగార్జున దగ్గర చెప్పింది. జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాను, నీ బిహేవియర్(ప్రవర్తన) బాగోదు అది ఇదీ అని చాలామాటలు అన్నారు సర్ అని తన బాధని బయటపెట్టింది. దీనిపై స్పందించిన మాధురి.. డబ్బులివ్వమని సుమన్, రీతూని అడిగారు సర్, సుమన్‌కి ఇవ్వకుండా మళ్లీ తీసుకెళ్లి పవన్‌కి ఇచ్చి అతడిని గెలిపించి కంటెండర్‌ని చేసింది. ఇలాంటివన్నీ బిగ్‌బాస్ హౌస్‌లో కాకుండా బయట చేసుంటే జుట్టు పట్టి నేలకేసి కొట్టేదాన్ని అని అన్నానని మాధురి వివరణ ఇచ్చుకుంది.
అయితే మాధురి మాటలపై సీరియస్ అయిన నాగార్జున.. మాధురి ఆఖరిసారి చెబుతున్నాను. నేలకేసి కొడతా, తొక్కుతా, తాటతీస్తా అనొద్దు. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండమ్మా. బిగ్‌బాస్ హౌస్‌లో కాదు అని చాలా స్మూత్‌గానే క్లాస్ పీకారు. శనివారం ఎపిసోడ్‌లో ఇదే హైలైట్ కానుందని అనిపిస్తుంది. మాధురి ఇంకేం మాట్లాడిందనేది పూర్తి ఎపిసోడ్‌లో చూడాలి.
(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్)


