
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు బెన్నీ బ్లాంకోను పెళ్లాడింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో స్నేహితులు, సన్నిహితులు, పలువురు హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు టేలర్ స్విఫ్ట్, పారిస్ హిల్టన్, మార్టిన్ షార్ట్, ఆష్లే పార్క్ లాంటి హాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. తాజాగా సింగర్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
కాగా.. సింగర్ సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. ఈ జంట గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 12న ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు తెగ వైరలయ్యాయి.
బెన్నీ బ్లాంకో ఎవరు?
బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్‌ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్‌లో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు.