‘జింగిల్ బెల్ హీస్ట్’ మూవీ రివ్యూ.. సూపర్ రాబరీ! | Jingle Bell Heist Review: A Festive Crime Thriller Now Streaming on Netflix | Sakshi
Sakshi News home page

‘జింగిల్ బెల్ హీస్ట్’ మూవీ రివ్యూ.. సూపర్ రాబరీ!

Dec 7 2025 12:44 PM | Updated on Dec 7 2025 12:58 PM

Jingle Bell Heist Movie Review In Telugu

దొంగతనాల కథాంశం సినిమాలలో మహా గమ్మత్తుగా, థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఏ తరం ప్రేక్షకులనైనా ఇట్టే మెప్పిస్తాయి. దొంగతనానికి సమయం, సందర్భంతో పాటు చక్కటి ప్రణాళిక కూడా చాలా ముఖ్యం. అదే నేపథ్యంలో హాలివుడ్ దర్శకుడు ఓ కొత్త చిత్రాన్ని వినూత్న రీతిలో తెరకెక్కించాడు. దాని పేరే జింగిల్ బెల్ హీస్ట్(Jingle Bell Heist Movie). పేరుకు తగ్గట్టు క్రిస్మస్ పండుగ నేపధ్యంలోనే జరిగే ఓ దొంగతనం పై ఈ సినిమా ఉంటుంది. దొంగతనంతో పాటు ఈ సినిమాలో సెంటిమెంట్, కామెడీ ఎలిమెంట్స్ తో మంచి థ్రిల్లింగ్ గా ఉంటుందీ సినిమా. 

ఈ సినిమా కథ విషయానికొస్తే ఓ పెద్ద మాల్ లో పని చేసే  సోఫీ తన కోసం, తన తల్లి ఆసుపత్రి ఖర్చుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. ఓ సమయంలో తన స్టోర్ లోనే కాస్తంత పెద్ద సొమ్మును కాజేస్తుంది. ఇది అక్కడి సీసీటీవిలో రికార్డ్ అవుతుంది. అయితే ఆ సీసీ టీవి ని ఎక్కడ నుండో హాక్ చేసిన నిక్ సోఫీ చేసిన పనికి వీస్తుపోతాడు. అదే అదనుగా నిక్ సో ఫీకి తన వీడియో చూపించి తాను చేయబోయే ఓ పెద్ద దొంగతనంలో సహాయ పడమని బెదిరిస్తాడు. ఇక వేరే దారి లేక సోఫీ నిక్ తో కలుస్తుంది. నిక్ సోఫీ పని చేసే స్టోర్ ఓనర్ లాకర్ ని దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ స్టోర్ ఓనర్  దగ్గర చాలా పెద్ద డబ్బు ఓ సేఫ్ లో ఉంటుంది. 

ఆ సేఫ్ సూపర్ సెక్యూర్ గా ఉంటుంది. అయితే నిక్, సోఫీ క్రిస్మస్ పండుగ రోజు దొంగతనం చేయాలనుకుంటారు. నిక్ స్టోర్ ఓనర్ సేఫ్ సెక్యురిటీని హాక్ చేసి పాస్ వర్డ్ తెలుసుకోవాలని స్టోర్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్ ని ట్రాప్ చేస్తాడు. మరి ఆ ట్రాప్ లో ఇరుక్కుని స్టోర్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్ పాస్ వర్డ్ లీక్ చేస్తుందా...సోఫీ నిక్ ఈ దొంగతనాన్ని చేయగలుగుతారా లేదా అన్నది మాత్రం నెట్ ఫ్రిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న జింగిల్ బెల్ హీస్ట్ మూవీలోనే చూడాలి. ఓ రొటీన్ పాయింట్ ని చాలా విభిన్నంగా చూపించాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఈ సినిమా మాతృక ఇంగ్లీషు అయినా తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది.  వీకెండ్ కి వాచ్ బుల్ మూవీ ఎంజాయ్.
– హరికృష్ణ ఇంటూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement