జయపురం: జయపురం గాంధీ జంక్షన్ సమీపంలో గల సుప్రియ కల్యాణ మండపం ప్రాంతంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కల్యాణ మండపంలో ఒక నాగు పాము ప్రవేశించిన విషయాన్ని వణ్యప్రాణుల సంరక్షకులు, వార్ టీమ్ కార్యదర్శి కృష్ణ కేశవ షొడంగికి తెలియజేశారు. వెంటనే ఆయన నేతృత్వంలో ఒక టీమ్ అక్కడికి చేరుకుంది. వారు శోధించగా జంగు పట్టిన ఒక ఇనుప గ్రిల్ కింద పామును కనుగొన్నారు. అందులో చిక్కుకున్న పాము బయటకు వచ్చేందుకు ప్రయత్నిచింది. అయితే ఈక్రమంలో దాని శరీరంపై గాయాలు అయ్యాయి. వెంటనే కృష్ణ కేశవ షొడంగి అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. కటర్ సహాయంతో గ్రిల్‌ను కట్ చేసి పాముని రక్షించారు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం
మంగళవారం ఉదయం అటవీ విభాగ సిబ్బంది వచ్చి పశు వైద్య కేంద్రానికి ఈ గాయపడిన పాముని తీసుకెళ్లారు. వెంటనే డాక్టర్ సునీల్ నాయిక్, డాక్టర్ రూప మిస్త్రి, డాక్టర్ ప్రతిక్షా మిశ్రాలు కలసిపాముకి ఆపరేషన్ చేసి దాని ప్రాణాలు కాపాడారు. పాముని జయపురం అటవీ విభాగ కార్యాలయ సిబ్బంది సంరక్షణలో ఉంచారు.
ఇదీ చదవండి: 9 ఏళ్ల బాలికపై హత్యాచారం : గ్రామంలో ఉద్రిక్తత


