హసీనా అప్పగింతకు భారత్‌ గడువు ఇవ్వలేదు | India had no choice except giving entry to Sheikh Hasina | Sakshi
Sakshi News home page

హసీనా అప్పగింతకు భారత్‌ గడువు ఇవ్వలేదు

Oct 4 2026 6:21 AM | Updated on Oct 4 2026 6:21 AM

India had no choice except giving entry to Sheikh Hasina

బంగ్లాదేశ్‌లో భారత రాయబారి 

దినేశ్‌ త్రివేది వెల్లడి

ఢాకా: పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్‌ హసీనాను ఫలానా గడువులోగా తిరిగి అప్పగిస్తామంటూ బంగ్లాదేశ్‌కు భారత్‌ ఎటువంటి హామీని ఇవ్వలేదని ఆ దేశంలో భారత రాయబారి దినేశ్‌ త్రివేది స్పష్టం చేశారు. హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ పంపించిన వినతిని భారత ప్రభుత్వం న్యాయకోణంలో పరిశీలిస్తోందని వెల్లడించారు. బంగ్లా రాజధాని ఢాకాలో శనివారం ఓ సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

పదవీచ్యుత ప్రధాని హసీనాను అప్పగించాలంటూ బంగ్లా ప్రభుత్వం భారత్‌ను పదేపదే కోరిన విషయం ప్రస్తావనకు రాగా త్రివేది ఈ మేరకు స్పందించారు. ‘అప్పగింతకు ఒక న్యాయ పరమైన ప్రక్రియ ఉందని, ఆ కోణంలోనే వినతిని పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం కూడా పదే పదే సమాధానమిస్తూనే ఉంది’అని వివరించారు. అంతేకాదు, ఆమెను భారత వైమానిక దళం కానీ, భారత ప్రభుత్వం కానీ బంగ్లాదేశ్‌ నుంచి తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు.

 ‘ఆ సమయంలో, ఆమె ఇంకా బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగానే ఉన్నారు. ఆ విషయంలో మాకు వేరే మార్గం లేకపోయింది. పరిస్థితిని బట్టి మనం అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ వాస్తవాన్ని అంగీకరించడం పొరుగుదేశంగా మా బాధ్యత’అని త్రివేది పేర్కొన్నారు. ‘మాకు వేరే ప్రత్యామ్నాయం ఏముంది? మీరు రావొద్దు. ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వం అని చెప్పి ఉంటే, పరిణామాలు ఎలా ఉండేవో’అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో 2024 ఆగస్ట్‌లో హసీనా(79) ప్రభుత్వం పడిపోయింది. ఆమె అప్పట్నుంచి భారత్‌లో ఉంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement