గువాహటి నైట్‌ క్లబ్‌లో దారుణం | Woman Allegedly Stripped and Beaten in a Guwahati nightclub | Sakshi
Sakshi News home page

గువాహటి నైట్‌ క్లబ్‌లో దారుణం

Oct 4 2026 6:35 AM | Updated on Oct 4 2026 6:35 AM

Woman Allegedly Stripped and Beaten in a Guwahati nightclub

మహిళను వివస్త్రను చేసి, బౌన్సర్ల దాడి 

ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన వీడియోలు 

సుమోటోగా పోలీసులు కేసు నమోదు 

ముగ్గురు మహిళలు సహా ఏడుగురు అరెస్ట్‌

గువాహటి: అసోంలోని గువాహటి నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను బార్‌లోని ఆడ, మగ బౌన్సర్లు కలిసి వివస్త్రగా మార్చి, దాడికి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఖానాపారా ప్రాంతంలో ‘ది లోకల్స్‌’అనే నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ మహిళను వివస్త్రగా మార్చి, కొందరు కాళ్లతో తన్నుతున్నట్లుగా ఉన్న వీడియో తమ దృష్టికి వచ్చిందని, దీనిపై డిస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సుమోటోగా కేసు నమోదు చేశామని గువాహటి ఈస్ట్‌ డీసీపీ తబు రామ్‌ పెగు తెలిపారు.

 ‘క్లబ్‌ సిబ్బంది బాధితురాలిపై శుక్రవారం వేకువజామున 2.30 గంటల సమయంలో దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించాం. అనంతరం, క్లబ్‌ నిర్వహిస్తున్న నాలుగో అంతస్తు నుంచి ఆమెను జుట్టు పట్టుకుని లాక్కుంటూ పార్కింగ్‌ ప్రాంతానికి తీసుకువచ్చారు. మత్తులో ఉన్న ఆమెను కాళ్లతో తన్నుతూ మరోసారి దాడికి పాల్పడ్డారు’అని డీసీపీ వివరించారు. ఆ సమయంలో, అక్కడికి చేరుకున్న మరో మహిళ ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లారు. 

ఈ ఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందజేయనందున క్లబ్‌ మేనేజర్‌ను, ఈవెంట్‌ మేనేజర్‌ను, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌తోపాటు దాడికి బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు మహిళా బౌన్సర్లు సహా ఏడుగురికి అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధిత మహిళ వివరాలు వెల్లడి కాలేదు. అయితే, ఈ నైట్‌ క్లబ్‌కు అర్ధరాత్రి 12.30 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండగా, తెల్లవారు జాము వరకు తెరిచి ఉండటంపైనా విచారణ చేపట్టామన్నారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఇలా ఉండగా, బాధిత మహిళ మొదటగా బీరు బాటిల్‌తో మహిళా బౌన్సర్‌పై దాడికి దిగిందని, ఆగ్రహంతో బౌన్సర్లంతా కలిసి ఆమెను పార్కింగ్‌ స్థలానికి లాక్కొచ్చి కొట్టారని క్లబ్‌ నడుస్తున్న భవనం వాచ్‌మాన్‌ అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement