breaking news
the locals
-
గువాహటి నైట్ క్లబ్లో దారుణం
గువాహటి: అసోంలోని గువాహటి నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను బార్‌లోని ఆడ, మగ బౌన్సర్లు కలిసి వివస్త్రగా మార్చి, దాడికి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఖానాపారా ప్రాంతంలో ‘ది లోకల్స్’అనే నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ మహిళను వివస్త్రగా మార్చి, కొందరు కాళ్లతో తన్నుతున్నట్లుగా ఉన్న వీడియో తమ దృష్టికి వచ్చిందని, దీనిపై డిస్పూర్ పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసు నమోదు చేశామని గువాహటి ఈస్ట్ డీసీపీ తబు రామ్ పెగు తెలిపారు. ‘క్లబ్ సిబ్బంది బాధితురాలిపై శుక్రవారం వేకువజామున 2.30 గంటల సమయంలో దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించాం. అనంతరం, క్లబ్ నిర్వహిస్తున్న నాలుగో అంతస్తు నుంచి ఆమెను జుట్టు పట్టుకుని లాక్కుంటూ పార్కింగ్ ప్రాంతానికి తీసుకువచ్చారు. మత్తులో ఉన్న ఆమెను కాళ్లతో తన్నుతూ మరోసారి దాడికి పాల్పడ్డారు’అని డీసీపీ వివరించారు. ఆ సమయంలో, అక్కడికి చేరుకున్న మరో మహిళ ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందజేయనందున క్లబ్ మేనేజర్‌ను, ఈవెంట్ మేనేజర్‌ను, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్తోపాటు దాడికి బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు మహిళా బౌన్సర్లు సహా ఏడుగురికి అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధిత మహిళ వివరాలు వెల్లడి కాలేదు. అయితే, ఈ నైట్ క్లబ్‌కు అర్ధరాత్రి 12.30 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండగా, తెల్లవారు జాము వరకు తెరిచి ఉండటంపైనా విచారణ చేపట్టామన్నారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఇలా ఉండగా, బాధిత మహిళ మొదటగా బీరు బాటిల్‌తో మహిళా బౌన్సర్‌పై దాడికి దిగిందని, ఆగ్రహంతో బౌన్సర్లంతా కలిసి ఆమెను పార్కింగ్ స్థలానికి లాక్కొచ్చి కొట్టారని క్లబ్ నడుస్తున్న భవనం వాచ్మాన్ అంటున్నారు. -
పదిరోజులైనా.. పట్టించుకోరా..?
మోర్తాడ్ : ఇటీవల కురిసిన వర్షాలకు మొండివాగు ఉధృతంగా ప్రవహించడంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో మొండివాగుపై నిర్మించిన వంతెన కూలిపోయింది.. వంతెన కూలి పది రోజులు కావస్తున్నా రైల్వే అధికారులు చర్యలు చేపట్ట లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.. వంతెన నిర్మాణంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చిన్నపాటి వాగు ప్రవాహానికే కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించే సమయంలో పిల్లర్లు వేసి స్లాబ్ వేయకుండా రింగులను ఏర్పాటు చేసి వాటిపై సిమెంట్ బిల్లలు మాత్రమే వేశారు. మొండి వాగు ఉధృతికి వంతెనపై ఏర్పాటు చేసిన సిమెంట్ బిల్లలు కుప్పకూలాయి. వంతెన పూర్తిగా కూలడంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లేదారి మూతపడింది. రైల్వే స్టేషన్, లైన్ ప్రారంభించకపోవడంతో ఈ ప్రాంతంలో అంతగా రద్దీ ఉండదు. అయితే రైల్వేస్టేషన్ పరిసరాల్లో పంటపొలాలు ఉండడంతో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలంటే ఈ వంతెన మీదుగానే వెళ్లాలి. అంతేకాక రైల్వే స్టేషన్లో చిన్న చిన్న పనులు కొనసాగుతున్నాయి. అధికారులు, కూలీలు, కాంట్రాక్టర్లు కూడా వెళ్లడానికి దారిలేకుండా పోయింది. పంట పొలాలకు వెళ్లడానికి వేరే మార్గం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయించాలని పలువురు కోరుతున్నారు.


