"గుంటూరును నాశనం చేశారు" | Ambati Rambabu Slams Pemmasani Over Flyover Demolition, Calls It Destruction Of Guntur City | Sakshi
Sakshi News home page

"గుంటూరును నాశనం చేశారు"

Dec 30 2025 3:20 PM | Updated on Dec 30 2025 4:22 PM

 Minister Pemmasani  destroyed Guntur

సాక్షి గుంటూరు: కేంద్రమంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనుమతి లేకుండానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేశారని, అద్భుతమైన కోర్‌ సెంటర్‌ను సేదు బంధు కింద తొక్కేశారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా భూసేకరణ చేశారని ఫ్లైఓవర్ కూల్చివేసిన తర్వాత అనుమతులడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఫ్లైఓవర్ కూల్చివేతతో రాకపోకలకు ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గంటూరు సిటికీ జరుగుతున్న అన్యాయాలపై తాను గళం విప్పితే మహిళల చేత తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.  మంత్రి పెమ్మసాని చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తానే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా  మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

కోర్టు ఆదేశించిన తర్వాత భూ సేకరణ చేస్తారా: అంబటి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement