breaking news
Vontimitta
-
పులివెందుల, ఒంటిమిట్ట పోలింగ్ సమాచారం ఇవ్వండి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి.. ‘‘పోలింగ్ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్, పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్, ఆ రోజు పోలింగ్ బూత్‌ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా....పోలింగ్ ఆఫీసర్ (పీఓ) డైరీ, ఫామ్–12. ఫామ్–32 ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలి’’ అని లేఖల్లో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్ఈసీకి వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్ఈసీ పట్టించుకోలేదు.ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్ బూత్‌లోకి వైఎస్సార్పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. వారి నుంచి ఏజెంట్ అధీకృత ఫామ్స్ లాగేసుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులెవ్వరూ ఓటు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చివరకు పులివెందులలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డిని కూడా ఓటు వేయనీయలేదు.ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు కదలనీయలేదు. ప్రతిచోటా పోలీసు బలగాలను ఉపయోగించారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా, ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ రెండు లేఖల ద్వారా ఎస్ఈసీకి విజ్ఞప్తి చేసింది. -
మైమరచిన పచ్చమీడియా!
1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆ పార్టీ అభిమానులు కొంతమంది కనిపించిన ఈనాడు జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. ఇదెక్కడి గొడవ! ఎంత టీడీపీకి సపోర్టు చేసినా, ఇలా మెడలో బొమికలు వేసుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడిందేమిటా అని కొందరు సీనియర్ జర్నలిస్టులు బాధపడేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నకలలో టీడీపీకి చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాలలో స్వీట్స్ కూడా పంచుకుని ఉంటారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అదో రకం. కాని రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఇంత సంబరపడాలా అని టీడీపీ క్యాడరే విస్తుపోతోంది. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ అధికారులన్నది ప్రజలందరికి తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా .. ఇలా అందరికి తెలుసు వాస్తవం ఏమిటో! అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారనిపిస్తుంది. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు ఇచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది. ముప్పై ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒకరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేశారు. ఈ ముప్పై ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దానిని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు. కాని పులివెందులలో రాక్షసులు ఉంటారన్నట్లుగా ప్రచారం చేసి ఒక ప్రాంత ప్రజలను అవమానించడానికి టీడీపీతోపాటు ఈ మీడియా వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి దొంగ ఓట్లు వేయిస్తుంటారని చెబుతారు. గతంలో అక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి అనే దివంగత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి ఎంత ప్రయత్నించినా, సాధ్యపడలేదని అనేవారు. దాని గురించి ఎన్నడైనా ఈ మీడియా ఒక్క వార్త రాసిందా? కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలావరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది మళ్లీ ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం? స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురి అవుతోంది. పోలింగ్ బూత్ లను మార్చేయడం, వైఎస్సార్సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్సార్సీపీ వారిపై దాడులకు తెగపడడం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీస్ అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానించినా తప్పు ఉండకపోవచ్చు.స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పని చేసింది తెలిసిపోతుంది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫోటోలతోసహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కాని, అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదే. ఇలాంటి అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ నేతలు రుణపడి ఉండవచ్చు. వైఎస్సార్సీపీ వారి ఎన్నికల ప్రచారాన్ని పత్తాపారం అంటూ పోల్చి, టీడీపీ వారి దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ పోలీస్ అధికారులను బహుశా టీడీపీ అధినాయకత్వం శహభాష్ అని మెచ్చుకుని ఉండాలి.ఇలాంటి వారందరికి డబుల్ ప్రమోషన్ లు కూడా వస్తాయోమే చూడాలని టీడీపీ నేతలే కొందరు చమత్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివితక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వ ఫీల్ అవుతోందట. వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజార్టీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్సార్సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్సార్సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయట పడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైఎస్సార్సీపీకి దిమ్మతిరిగే ఫలితం అని మరో టీడీపీ మీడియా రాసింది. అవును..అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని,అరాచకం చేస్తే వైఎస్సార్సీపీకి కాదు దిమ్మతిరిగేది.. రాష్ట్ర ప్రజలకు.ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికి అర్థమైపోయింది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటికి జగన్‌పై ద్వేషం ఉంటే ఉండవచ్చు. కాని ఆయనపై కోపంతో ఈ మీడియా సంస్థల అధినేతలు తమ దుస్తులు తామే ఊడదీసుకుని నగ్నంగా బజారులో నిలబడి నవ్వులపాలవుతున్న సంగతిని విస్మరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వాటి పని అవి చేయకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో, ప్రజలలో ఎంత అపనమ్మకం ఏర్పడుతుందో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాటి చెప్పాయి.ప్రభుత్వ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ, ఒక వర్గం మీడియా వ్యవస్థ అన్ని కుమ్మక్కై ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందని భావించిన న్యాయ వ్యవస్థ కూడా అలా చేయలేకపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది.ప్రభుత్వం నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చేది.అయినా బుల్ డోజ్ చేసి తమ ఎల్లో మీడియా మద్దతుతో ఏమి చేసినా జనం నమ్ముతారులే అనుకుంటే అది భ్రమే అవుతుంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఇలాగే చంద్రబాబు అరాచాకాలు చేయించి గెలిచారు. కాని సాధారణ ఎన్నికలలో టీడీపీ అంతకు రెట్టింపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ ప్రమేయం ఈ ఎన్నికలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన సంబరపడిపోతే అది ఆయన అమాయకత్వమే అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి వంతపాడి ఆయన ఎంత దీన పరిస్థితిలో ఉంది తెలియచేసినట్లయింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కోరిన వెంటనే కేవలం ఈ రెండిటికే ఎన్నికలు పెట్టడం, అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్లుమూసుకుని కూర్చోవడం, కనీసం అధికార యంత్రాంగాన్ని మందలిచే ధైర్యం చేయకపోవడం వల్ల, ప్రభుత్వంలోని వారెవరైనా ఎన్నికల కమిషనర్‌ను బెదిరించారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయడం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్చనివ్వడం ద్వారా, పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నిటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా, అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో! ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓటమికి కారణం అయ్యాయనుకోవాలి.ఇది దేశానికి మంచిదా?కాదా?అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రిగ్గింగ్ ఎన్నికల్లో.. సిగ్గుపడే గెలుపు
సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: ‘‘అసలు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఒక ఎన్నికలా..? ఏ ఒక్క బూత్లోనూ విపక్ష ఏజెంట్లను రానివ్వకుండా రిగ్గింగ్ చేసి, అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచి సంబరాలు చేసుకోవడం ఏమిటి? ప్రపంచ చరిత్రలో ఏ ఎన్నికా ఇలా జరిగి ఉండదు...!’’ అని ప్రజాస్వామికవాదులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశంలో ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు. కానీ మొట్టమొదటిసారి ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబు సర్కారుది..’ అని వ్యాఖ్యానిస్తున్నారు. కళ్లు మూసుకున్న ఎన్నికల కమిషన్!పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ గట్టెక్కింది! ఎన్నికల ముందు తాలిబన్లు, బందిపోటు ముఠాల మాదిరిగా అటకాయించి వైఎస్సార్ సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు తెగబడటంతో మొదలైన పచ్చముఠాల అకృత్యాలు ఎన్నికల రోజు మరింత యథేచ్ఛగా సాగాయి. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని కొమ్ము కాసే పోలీసుల సహకారంతో ప్రభుత్వ పెద్దలు ఎన్నికల అరాచకాలకు బరి తెగించారు. టీడీపీ నేతలు ఎన్నికల ముందు రోజు రాత్రే వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ల ఇళ్ల వద్దకు చేరుకుని వారు బయటకు రాకుండా మోహరించారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అసలు విపక్ష పోలింగ్ ఏజెంట్లే లేకుండా చేసి అధికార పార్టీ అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడినా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలపై బైండోవర్ కేసులు మొదలు హత్యాయత్నం, కౌంటర్ కేసులు బనాయించి అరెస్టులు చేసుకుంటూ వెళ్లారు. పట్టపగలు నల్లగొండువారిపల్లె గ్రామం మధ్యలో ప్రజలంతా చూస్తుండగా ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితులను ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. పైగా కౌంటర్ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్‌ల వద్దకు రాకుండా దగ్గరుండి మరీ అడ్డుకుని టీడీపీ గూండాలకు సహకారం అందించారు. ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే తిష్ట వేసి ఈ అరాచకాలను పర్యవేక్షించడం విస్మయం కలిగిస్తోంది. ఒంటిమిట్టలో మంత్రి సమక్షంలోనే దాడులు..ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 10.30 వరకు సాఫీగా సాగినా ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పసిగట్టిన పచ్చముఠాలు బూత్‌లను ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడ్డాయి. ఏకంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలోనే వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. టీడీపీ గూండాలను వారించకపోగా.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను రాకుండా కట్టడి చేయడంతో అధికార పార్టీ బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుంది. పోలింగ్ రోజంతా విచ్చలవిడిగా సాగిన టీడీపీ మూకల రిగ్గింగ్, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో జాతరను తలపించింది. ఉదయం పోలైన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత పచ్చ ముఠాలు అక్రమాలకు బరి తెగించాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని దొంగ ఓట్లు వేశాయి. సాయంత్రం వరకు విపక్ష ఏజెంట్లు లేకుండా ఈ డ్రామా సాగింది. ఈ అరాచకాలు, అక్రమాలు, ఏకపక్ష ఎన్నికలను నిరసిస్తూ కడపలో జరిగిన కౌంటింగ్‌ను వైఎస్సార్ సీపీ అభ్యర్థితోపాటు ఏజెంట్లు బహిష్కరించారు.అభాసుపాలైన ఎస్ఈసీ..జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభాసుపాలైంది. ఓటర్లు నాలుగైదు కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఓట్లు వేయాల్సి వచ్చేలా పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేసినా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుంది. టీడీపీ నాయకులు దొంగ ఓటర్ల అవతారం ఎత్తిన వైనం మీడియా, సామాజిక మాధ్యమాల్లో రోజంతా వైరల్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు మహిళలవి కూడా దొంగ ఓట్లు పోలయ్యాయి. పులివెందులలో 3,684 మంది మహిళలు ఓట్లు వేసినట్లు నమోదైంది. వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తే బోగస్ బాగోతం వెల్లడవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవస్థలన్నీ కుమ్మక్కై రౌడీ రాజ్యానికి పట్టం కట్టారని పులివెందుల ప్రజలు పేర్కొంటున్నారు.ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? సాక్షి, అమరావతి: ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అందుకే కౌంటింగ్ ప్రక్రియను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించామని ఒంటిమిట్ట వైఎస్సార్ సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒంటిమిట్టలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగాయని, ఆ తరువాత టీడీపీ నేతలు పోలీస్ ప్రొటెక్షన్‌తో రిగ్గింగ్ చేసుకుని దొంగ ఓట్లు వేసుకున్నారని వెల్లడించారు. ఈ రెండు ఉప ఎన్నికలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట, పులివెందులలో ఏ గ్రామానికి వెళ్లినా వేలికి సిరా గుర్తు లేని వారే కనిపిస్తారని చెప్పారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఓటర్లకు సిరా గుర్తు ఉందో లేదో విచారణ చేయాలని కోరారు. గ్రామాలకు వచ్చి నిజమైన ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు టీడీపీకే కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కడప శివార్లలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 6,033 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి 6,267 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. -
ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్‌ను అడ్డుకోవాల్సింది: హైకోర్టు
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అక్రమాలపై వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్‌బూత్‌ల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారని.. పక్క నియోజకవర్గాల నుంచి మనుషులను రప్పించి రిగ్గింగ్ చేయించారని వైఎస్సార్సీపీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే విజేతను ప్రకటించాక కోర్టుల జోక్యం అనవసరమంటూ టీడీపీ తరఫు లాయర్ వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో ఆదేశాలు జారీ చేయనుంది.వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున లాయర్ వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. మొత్తం 15 పోలింగ్‌బూత్‌ల్లోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. జమ్మలమడుగు నుంచి వాహనాల్లో వచ్చారు. ఆ వాహనాలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫొటోలు ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు క్యూ లైన్లో నిల్చిన ఓటేసిన ఫొటోలు ఉన్నాయి. ఓటర్లను భయభ్రంతాలకు గురి చేసి ఓట్లేశారు. కలెక్టర్ సమక్షంలో దొంగ ఓటు వేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఎన్నికలో జరుగుతున్న దౌర్జన్యాలను అదే రోజు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నిలక సంఘం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదు. తమను అనుమతించలేదని వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు అని వాదించారు. అయితే.. టీడీపీ తరఫు లాయర్ వాదిస్తూ.. ఎన్నిక సంబంధమైన వివాదాల్లో జోక్యం చేసుకునే హైహక్కు కోర్టుకు లేదు. ఇప్పటికే విజేతను ప్రకటించారు. కాబట్టి కోర్టుల జోక్యం అనవసరం అన్నారు. ఈ క్రమంలో.. పిటిషనర్ల తరఫున మాజీ ఏజీ శ్రీరామ్ వాదిస్తూ.. ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోవద్దనే నియమం ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేశారు. మోహిందర్ సింగ్ కేసులో కోర్టు రీపోలింగ్‌కు ఆదేశించింది. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు.. జోక్యం చసుకునే హక్కు హైకోర్టుకు ఉంది అని తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ స్పందిస్తూ.. ఎస్ఈసీ కల్పించుకుని రిగ్గింగ్‌ను అడ్డుకోవాల్సిందని అన్నారు. అంతేకాదు.. ఇతర ప్రాంతాల వారు ఓట్లు వేస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల అవకతవకల పిటిషన్ వాదనలు పూర్తి కావడంతో ఆదేశాలు మధ్యాహ్నాం తర్వాత జారీ చేస్తామని తెలిపారాయన. ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారని, పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి దొంగ ఓట్లు వేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ పోలింగ్‌కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. -
జగన్ ప్రెస్‌మీట్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన కలెక్టర్
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్ రాజ్యమేలింది. నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు యథేచ్చగా దొంగ ఓట్లు గుద్దుకున్నారు. క్యూలో దర్జాగా రకరకాల ఫోజులతో నిలబడి మరీ ఓట్లు వేశారంటూ ఇవాళ మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ఆ విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో.. కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎదురుగానే దొంగ ఓట్లుపడ్డ సంగతిని వైఎస్ జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకు సంబంధిత దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారాయి. అయితే ఫోటోలో ఉన్నది దొంగ ఓటర్లని బహిర్గతం కావడంతో కలెక్టర్ కంగుతిన్నారేమో..! దీంతో అప్పటికే ఆ ఫోటోలను తన ఎక్స్‌లో పోస్ట్ చేసిన జిల్లా కలెక్టర్ వెంటనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలేంటి..? రాష్ట్ర చరిత్రలో తొలిసారి
-
కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు.. బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్
-
Big Question: రాబోయే రోజుల్లో టీడీపీ పతనం.. ఎంత దారుణంగా ఉండబోతుందంటే..
-
Magazine Story: ప్రజాస్వామ్యానికి పాతర.. పచ్చ ముఠా దొంగ ఓట్ల జాతర
-
పులివెందులలో అరాచకాలపై YS జగన్ ఉగ్రరూపం
-
Big Question: బాబు డైరెక్షన్ లో బోగస్ ఎలక్షన్..
-
ఒంటిమిట్టలోనూ అరాచకమే...!
ఎలాగైనా గెలవాలన్న కుతంత్రం... అడ్డదారులను ఎంచుకుని రాద్ధాంతం... అధికారాన్ని ఆయుధంగా చేసుకుని స్వైరవిహారం... యథేచ్ఛగా అక్రమం... ఇదీ కూటమి ప్రభుత్వం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చేసిన అరాచకీయం..! ఇందుకోసం సాక్షాత్తు రాష్ట్ర మంత్రి హోదాలోని వ్యక్తే బరితెగించారు. ఈ తతంగమంతా కళ్లెదుటే జరుగుతున్నా ఏమీ చూడనట్లు అధికారులు, పోలీసు యంత్రాంగం మౌనంంగా ఉంది. సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అనుచరగణంతో హల్చల్ చేశారు. దౌర్జన్యకాండకు తెరలేపారు. మంత్రిని చూడగానే టీడీపీ శ్రేణులు, వారివెంట వచ్చిన రౌడీ మూకలు రెచ్చిపోయాయి. బూత్‌లలోకి ప్రవేశించి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులకు దిగాయి. బూత్‌ల నుంచి బయటకు ఈడ్చి వేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇదంతా మంత్రి సమక్షంలోనే జరిగింది. ఆయన బూత్‌లలోకి వెళ్తుండడాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ, అధికార బలం దానికి పోలీసుల పూర్తి సహకారం తోడవడంతో ఏమీ చేయలేకపోయారు. ఒంటిమిట్టలో ఉదయం 9.30 వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇలాగైతే టీడీపీకి ఓటమి తప్పదని మంత్రి భావించారు. ఒంటిమిట్ట జెడ్పీ హైస్కూల్లోని బూత్‌లోకి ప్రవేశించి వైఎస్సార్సీపీ ఏజెంట్‌ను స్వయంగా లేపి బయటికి పంపారు. మంత్రి అనుచరులు మిగిలినవారినీ పంపించేస్తూ టీడీపీ ఏజెంట్లను మాత్రమే కూర్చోబెట్టారు. చిన్నకొత్తపల్లె గ్రామంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా 300 మందితో వచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన గ్రామస్తుడు, వైఎస్సార్సీపీ కార్యకర్త వల్లెపు సుబ్బయ్యపై మంత్రి దాడి చేయించారు. పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారు. మండలంలోని 30 కేంద్రాల్లో మంత్రి అనుచరులు దగ్గరుండి ఓట్లు వేసుకున్నారని స్థానికులు తెలిపారు.మంటపంపల్లెలో చెలరేగిన పచ్చమూకఒంటిమిట్ట నుంచి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మంటపంపల్లె వెళ్లగా టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు తోసేశాయి. ఇది తెలిసి వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నేతలు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నేతలు పులి సునీల్‌కుమార్, షఫీ నేరుగా మంటపంపల్లె చేరుకున్నారు. గట్టిగా నినాదాలు చేస్తూ మంత్రిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఇది చూసి చేసేదేమీ లేక మంత్రి వెళ్లిపోయారు. కానీ, అప్పటికే బూత్‌లో దొంగ ఓట్ల పరంపర కొనసాగింది. ఇలా మంత్రి వెళుతున్న ప్రతి చోటికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లి అడ్డుకున్నారు. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే వైఎస్సార్సీపీ నేతలందరినీ పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేతలను వదిలివేయడంతో వారు రిగ్గింగ్ కొనసాగించారు.రాళ్లు రువ్విన టీడీపీ బ్యాచ్చిన్నకొత్తపల్లె బూత్‌లో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లపై మంత్రి సమక్షంలోనే పిడిగుద్దులు గుద్దుతూ తన్నుతూ బయటకు తోసేశారు. టీడీపీ మూకలు రాళ్లు వేయడంతో ఏజెంట్‌కు గాయాలయ్యాయి. అక్కడి మహిళలు కూడా మంత్రి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు మరోసారి వచ్చి మంత్రిని అడ్డుకున్నారు. దీంతో బూత్‌లోపల ఉన్న మంత్రి వెళ్లిపోయారు. భారీగా పోలీసులు ఉన్నా బూత్ లోపల ఏం జరుగుతుందో తెలియనట్లు ఉండిపోయారు.వైఎస్సార్సీపీ నేతల అరెస్టు.. గృహ నిర్బంధంఒంటిమిట్ట మండలంలో మధ్యాహ్నం వరకు మంత్రి హల్చల్ కొనసాగగా ఏమీ చేయని పోలీసులు... జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఫాంహౌస్ వద్ద ఉన్న రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా తదితరులను అరెస్టు చేసి కడపకు తరలించడం గమనార్హం. ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డిలను అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.ఒంటిమిట్టలో పోలింగ్ సాయంత్రం వరకు టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగింది. ఒకపక్క మంత్రి, మరో పక్క రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలు, దాడులకు దిగాయి. పచ్చ నేతలు పదేపదే భారీగా బూత్‌లలోకి వెళ్తున్నా పోలీసులు అభ్యంతరం తెలపలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం దగ్గరకు రానీయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.రీపోలింగ్ నిర్వహించాలి: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిఒంటిమిట్ట మండలంలో టీడీపీ నేతల కనుసన్నల్లో రిగ్గింగ్ జరిగిందని, రీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓబులమ్మను కలిసి విన్నవించారు. రాయచోటి, రాజంపేట నుంచి టీడీపీ రౌడీ మూకలుఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రాయచోటి, రాజంపేట నుంచి వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ రౌడీ మూకలు, బౌన్సర్లు పేట్రేగిపోయారు. బూత్‌లలోకి చొరబడి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఉదయం వరకు సాఫీగా సాగిన పోలింగ్.. ఓటర్ల నుంచి స్లిప్పులను కూడా లాక్కున్న వీరి అలజడి, దౌర్జన్యంతో ఉద్రిక్తంగా మారింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టీడీపీ రౌడీల అండతో దొంగఓట్లు, రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు.మంత్రి బూత్‌లలో తిష్ట వేయగా శ్రేణులు రిగ్గింగ్ కొనసాగించాయి. పోలీసులు మాత్రం సెల్ఫోన్లు చూసుకుంటూ కొందరు, కాలక్షేపానికి విజిల్స్ వేస్తూ కొందరు పోలీసులు ఉండిపోయారు. మండలం అంతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడచూసినా టీడీపీ నేతలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరిచారు. సాయంత్రం వరకు కాన్వాయ్‌లో తిరుగుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ నేతలకు మాత్రం ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ సమీప ప్రాంతాలకు రానివ్వలేదు. ఎన్నికల కమిషన్ దృష్టిసారించి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పోలింగ్‌లో అక్రమాలు బట్టబయలు అవుతాయి. కాగా, వైఎస్సార్సీపీ గ్రామ స్థాయి నేతలను మంగళవారం ఉదయమే స్టేషన్‌కు తీసుకెళ్లారు. కీలక నేతలు వచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికిముందు కూడా పోలింగ్ బూత్‌ల వద్ద నాయకులు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్తవారు వచ్చి మా ఓటు వేశారుఎవరో కొత్తవారు వచ్చి బూత్‌లలో కలిసిపోయి, మా ఓట్లు వేసేశారు. ఇదేంటి అని నిలదీసిన వైఎస్సార్సీపీ ఏజెంట్ వల్లెపు సుబ్బయ్యను మంత్రి మండిపల్లి ముందే బయటకు లాగి, విచక్షణారహితంగా కొట్టారు. – రాయచోటి వరలక్ష్మీ, చిన్నకొత్తపల్లె, ఒంటిమిట్టఇలాంటి గూండాగిరి ఎన్నడూ చూడలేదుఒంటిమిట్ట చరిత్రలో ఇలాంటి గూండాగిరి ఎన్నడూ వినలేదు చూడలేదు. మండలంలో ఎప్పుడూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు ఎవరో మంత్రి అట.. ఆయన పోయిన ప్రతి బూత్‌లో బయటకు వస్తూనే గొడవలు జరిగాయి. ఇంత దౌర్జన్యంగా ఎన్నికలు జరిపితే ఏమి, లేకుంటే ఏమి.? – వల్లెపు నాగజ్యోతి, చిన్నకొత్తపల్లె, ఒంటిమిట్ట -
రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జరిగిన అరాచకాలపై మంగళవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని,పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే.పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/Qky1FZjeQA— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025 ‘చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు...ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానం. కాని చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడింది. మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్‌లను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్‌లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుగారి సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?’అని ప్ర శ్నించారు.‘అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు. 15నెలల ఆయన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత, పారిశ్రామిక రంగాలు సహా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. ప్రతి కుటుంబం తన కాళ్లమీద తాను నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ, ఆ స్కీములు అన్నిటినీ రద్దుచేయడమే కాదు, తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లనూ మోసాలతో, అబద్ధాలతో ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లెటరైట్, లిక్కర్, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాల కోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, విద్యాదీవెన, వసతి దీవెన లేదు, ఆస్పత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకూ ఆరోగ్యశ్రీ లేదు. స్కూళ్లలో నాడు-నేడు లేదు, ట్యాబుల్లేవు, టోఫెల్ పీరియడ్స్‌తో పాటు ఇంగ్లిషు మీడియం లేదు. మరి ఇలాంటి అబద్ధాలు, మోసాలు, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుగారికి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు?’ ..పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్నప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా? ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్ బూత్‌లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారు. రెండు చిన్న ZPTC స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తే దాంతో సాధించేది ఏముంటుంది?..2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 34,560 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్‌బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు చేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారు...పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం. అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం’ అని చంద్రబాబు రౌడీ రాజ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలింగ్ బూత్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దౌర్జన్యం
-
‘ఒంటిమిట్టలో రిగ్గింగ్‌పై.. ఈసీకి జడ్పీటీసీ అభ్యర్ధి ఫిర్యాదు
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పచ్చమూక రెచ్చిపోయింది. అధికార బలాన్ని అడ్డంపెట్టుకొని పోలింగ్ బూత్‌లలోనే దొంగ ఓట్లు వేయించింది. అందుకు పోలీసులు కొమ్ముకాయడంతో ప్రజలు తమ విలువైన ఓట్లను వినియోగించుకోలేకపోయారు. పోలింగ్ బూత్‌లలో దొంగ ఓట్లు వేస్తున్నారని, మా ఓట్లను మేం వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసుల కాళ్లమీద పడ్డా ఫలితం లేకుండా పోయింది.ఈ క్రమంలో జడ్పీటీసీ ఉప ఎన్నికపై ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధి సుబ్బారెడ్డి ఎన్నికల అధికారులను ఆశ్రయించారు. 17బూత్‌లకు రీపోలింగ్ జరపాలని కోరారు. ఈ మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి ఓబులమ్మకు ఫిర్యాదు చేశారు. మొత్తం 30 బూత్‌లకు 17బూత్‌లలో రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. -
డీఐజీ కోయ ప్రవీణ్‌కు అంబటి వార్నింగ్
సాక్షి,విజయవాడ: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు తీసుకువచ్చిన దొంగ ఓటర్లకు పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తున్నారని, పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సెగ్మెంట్లో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తుంటే, మరోవైపు కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా కాయడం దారుణమని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంకు వస్తున్న కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం ఈ ఎన్నికల్లో పోలీసులు అధికారపార్టీకి ఎంత తొత్తులుగా మారి పనిచేస్తున్నారనడానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...2017 లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా దారుణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న వారు అక్కడి సెగ్మెంట్లకు చెందిన వారు కాదు. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, రౌడీలను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి మా పార్టీ నేత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫొటోలతో సహా బయటపెట్టారు. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తుల పేర్లతో సహా వెల్లడించారు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి. పులివెందుల్లో ఉన్న 10,601 ఓట్లలో యాబై శాతంకు మించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో వేయించారు. పులివెందుల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకోలేకపోయారు. పోలీస్ యంత్రాంగం వైఎస్సార్సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. చివరికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా బయట తిరగనివ్వకుండా నిర్భందించారు.ఎంపీ అవినాష్‌రెడ్డిపై ఆంక్షలు:కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డిని పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకువెడుతున్నారో కూడా చెప్పకుండా గంటల తరబడి వాహనాల్లో తిప్పారు. దీనిని పార్టీ నేతలు ప్రశ్నించడంతో ఎర్రగుంట్లలో ఓ పార్టీ నాయకుడి ఇంటిలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల పార్టీ కార్యాలయంకు వచ్చారు. ఈ సమాచారం తెలియగానే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అక్కడికి వచ్చి నేను కూడా మీ పార్టీ కార్యాలయంలోనే కూర్చుంటాను అంటూ కూర్చున్నారు. ఒకవైపు రెండు సెగ్మెంట్లలోనూ టీడీపీ వారు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తుంటే, దానిని అడ్డుకోకుండా, వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి బయటకు రాకుండా కాపలా కాస్తూ కూర్చుంటాను అని కోయ ప్రవీణ్ అనడం చూస్తుంటేనే వారి కుట్రలు అర్థమవుతున్నాయి. వైఎస్సార్సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వవద్దని, టీడీపీ దొంగ ఓట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆయన ఆదేశాలు ఇచ్చేశారు. ఆయన ఖాకీ చొక్కాకు బదులు పచ్చ చొక్కా వేసుకున్నట్లుగా, తెలుగుదేశం ఏజెంట్‌గా, కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇంత కన్నా దిగాజరుడుతనం ఎక్కడైనా ఉంటుందా? టీడీపీని గెలిపించేందుకు ఐపీఎస్ అధికారి డీఐజీ కోయ ప్రవీణ్ దిగజారి వ్యవహరిస్తున్నారు. దీనిని ప్రజాస్వామికవాదులు మరిచిపోతారా? పోలీసులే దొంగ ఓటర్లను ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు తమ హక్కులను కాపాడాలని ఓటర్లు పోలీసులు కాళ్ళు పట్టుకుని ప్రాదేయపడుతున్నా వారు పట్టించుకోవడం లేదు.మా పార్టీ ఆఫీస్‌కే వచ్చి... మా కార్యకర్తలనే కాల్చేస్తామని వార్నింగ్:వైఎస్సార్సీపీ కార్యాలయానికే వచ్చి పార్టీ కార్యకర్తలను 'నా కొడకల్లారా.... కాల్చిపారేస్తాను' అంటూ పులివెందుల్లో డీఎస్పీ హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికేనా? చంద్రబాబు, డీఐజీ ప్రవీణ్ అండగా ఉన్నారన్న అహంకారమా? వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు వెళ్ళి, వారి కార్యాలయంలో ఒకవైపు ఎంపీ ఉండగానే, బయట ఉన్న కార్యకర్తలను కాల్చి పారేస్తాను అంటూ హెచ్చరించడం డిఎస్పీ అహంకారానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే ఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను ఎన్నికల్లో చూడలేదు. రెండు జెడ్పీటీసీల కోసం చంద్రబాబు ఇంత కక్కుర్తి పడాలా? వందేళ్ళ పాటు ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళారు. చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నాడు. ఈ సంప్రదాయం చంద్రబాబు, ఆయన కుమారుడిని వెంటాడదా? ఈ పరిణామాలను చూస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల గుండెలు మండిపోతున్నాయి.డీఐజీ కోయ ప్రవీణ్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది:వైఎస్ అవినాష్‌ను పోలీసులు వెంటాడుతున్నారు. ఏకంగా ఆయన ఉన్న పార్టీ ఆఫీస్‌లోనే కూర్చుని, ఆయనను గమనించేందుకు డీఐజీ తెగబడ్డారు. మరోవైపు ఇరవై కార్లతో జమ్మలమడుగు ఎమ్మెల్యే తిరుగుతున్నా, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కాన్వాయితో తిరుగుతున్నా పోలీసులకు కనిపించదు. యధేచ్ఛగా దొంగ ఓట్లు వేయించుకుంటున్న వైనం వారికి కనిపించదు. డీఐజీ కోయ ప్రవీణ్ ఉద్యోగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇటువంటి అధికారిని చూస్తుంటే సిగ్గేస్తుంది. అవినాష్‌రెడ్డి బయటకు వెళ్ళి, జరుగుతున్న తప్పులను పట్టుకుంటారేమోనని భయపడుతున్నారు. మహిళలు తమ హక్కును కాపాడాలని ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. జమ్మలమడుగు టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు పులివెందుల ఎన్నికల్లో ఓటు వేశాడంటేనే ఈ ఎన్నిక ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. దీనిని డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం. -
YSRCP ఏజెంట్ పై దారుణం..! ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈడ్చి
-
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు: అంబటి
సాక్షి, విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు, ఓటర్లు బూత్‌ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ, పోలీసులు కలిసి వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం కుట్ర చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసుల సహాయంతో మా పోలింగ్ ఏజెంట్లను బయటికి నెట్టేశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ గూండాలు వచ్చారు. వైఎస్సార్సీపీ నేత బలరాంరెడ్డి పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నప్పటికీ ఆయన్ని వెళ్లనివ్వలేదు. వైఎస్సార్సీపీకి ఓటు వేసే వారిని గుర్తించి బయటికి పంపించేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. సాయంత్రం వరకూ అవినాష్ రెడ్డిని తిప్పాలనుకున్నారు. ప్రజలు తిరగబడటంతో ఎర్రగుంట్లలో వదిలిపెట్టారు..ఎస్వీ సతీష్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధిని కూడా బయటికి రానివ్వలేదు. టీడీపీ అభ్యర్ది మాత్రం అన్ని చోట్లా తిరగనిస్తున్నారు. నల్లకుంట్ల పాడులో పోలీసుల కాళ్లు పట్టుకుని మరీ ఓటర్లు వేడుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే కుట్ర మొదలైంది. పులివెందుల, ఒంటిమిట్టలో కుట్రలతో గెలవాలని ముందే ప్లాన్ చేశారు. కుట్రలతో గెలిచి వైఎస్ జగన్ పనైపోయిందని ప్రచారం చేయాలని చూస్తున్నారుటీడీపీ ఓటర్లు మాత్రమే ఓటేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరం. నంద్యాలలో కూడా చంద్రబాబు ఇలానే చేశారు. చంద్రబాబు చర్యలతో వందేళ్లు వెనక్కిపోయాం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇంత దుర్మార్గంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదు. కనంపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్‌ను తుపాకీతో బెదిరించారు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీడీపీ నేత నాగేశ్వరరెడ్డి పులివెందులలో ఓట్లు వేశారు. ఎన్నికల కమిషన్ తీరు చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉంది. ఎన్నికల కమిషన్, టీడీపీ, పోలీసులు ఒక్కటైపోతే ఎన్నికలు ఏం జరుగుతాయి?బ్యాలట్ ఓటింగ్‌లోనే ఇంత అరాచకం చేస్తే.. ఇక ఈవీఎంలు అయితే మరింత దారుణంగా వ్యవహరించేవారు. పులివెందులలో గెలిచానని చెప్పుకోవడానికి చంద్రబాబు ఇలా చేస్తున్నాడు. పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటిసి అభ్యర్థి గన్‌మెన్‌ను రాత్రికి రాత్రి మార్చేశారు. రాబోయే కాలంలో ప్రతిఫలం చంద్రబాబు అనుభవించక తప్పదు. చంద్రబాబు నీచమైన వ్యక్తి అని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయింది.ఇంతకంటే దుర్మార్గం ఏముంది?: వెలంపల్లి శ్రీనివాస్పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో దారుణంగా వ్యవహరించారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకునేలా చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది?. చంద్రబాబుకి శునకానంద తప్ప ఏమీ ఒరగదు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూటమి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. ఏం సాధించావని ఎన్నికల్లో ఇలా వ్యవహరిస్తున్నారు.దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు: మల్లాది విష్ణుఎన్నికల కమిషన్ నియమనిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదు. పులివెందుల, ఒంటిమిట్టలో రెవిన్యూ, పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్నారు. ఓటర్లను గ్రామ పొలిమేర్లలోనే అడ్డుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులకు పులివెందుల, ఒంటిమిట్టలో ఏం పని?. దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. ఇది అసలు ఎన్నికే కాదు. ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓటమి భయంతో కుట్రపూరితంగా చంద్రబాబు వ్యవహరించారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదు -
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కుతంత్రం...
-
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
Pulivendula Vontimitta ZPTC Election.. Polling Updates:పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్భారీగా దొంగఓట్లు వేసిన జమ్మలమడుగు టీడీపీ గూండాలురిగ్గింగ్కు పాల్పడ్డ కమలాపురం,మైదుకూరు టీడీపీ గూండాలుక్యూలైన్లలో నిలబడి టీడీపీ గూండాలే ఓట్లు వేసిన వైనంఅసలు ఓటర్లకు బదులు దొంగ ఓట్లు వేసిన టీడీపీ గూండాలు ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున రిగ్గింగ్‌టీడీపీ గూండాలకు కొమ్ముకాసిన పోలీసులు ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటువేసేందుకు అవకాశం భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను తరలించనున్న అధికారులు పులివెందులపై పోలీసులు పగబట్టారు: అవినాష్రెడ్డిపులివెందులలో భారీ రిగ్గింగ్ జరిగిందిప్రతీ గ్రామంలోనూ టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేశారుపోలీసులు, టీడీపీ గూండాలు కలిసి రిగ్గింగ్ చేశారుఈ ఎన్నికలను బర్తరఫ్ చేయాలికేంద్ర బలగాలతో రీ పోలింగ్ నిర్వహించాలికార్యకర్తలు సంయమనం పాటించాలిపోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారుఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండిఅన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందాంఓటర్ ప్లిప్‌లు లాక్కోని బయటకు పంపారుటీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై కుట్రలు చేశారుఇంత చెత్త, ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదుకనంపల్లి గ్రామస్తులను ఓట్లు వేసుకోనివ్వలేదుమా ఏజెంట్లను పోలింగ్ బూత్‌లో లేకుండా చేశారుబయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారుపార్టీ కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం దారుణం : అంబటిపులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు దొంగఓట్లు వేస్తున్నారువారికి పోలీసులు సహకరిస్తున్నారుపోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారుటీడీపీ నేతలు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం దారుణంఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది.డీఐజీ కోయ ప్రవీణ్ ఉద్యోగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారుఇటువంటి అధికారిని చూస్తుంటే సిగ్గేస్తుంది.జమ్మలమడుగు ఎమ్మెల్యే తిరుగుతున్నా, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కాన్వాయితో తిరుగుతున్నా పోలీసులకు కనిపించదుజమ్మలమడుగు టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు పులివెందుల ఎన్నికల్లో ఓటు అలాంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పడం డీఐజీ కోయ ప్రవీణ్ దివాలాకోరుతనానికి నిదర్శనంపులివెందులపులివెందులలో మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన పోలింగ్ 71.36శాతంమొత్తం పోలింగ్ స్టేషన్లు:15మొత్తం ఓటర్లు:10,601పోలైన ఓట్లు:7,565ఒంటిమిట్టఒంటిమిట్టలో మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన పోలింగ్ 66.39 శాతంమొత్తం పోలింగ్ స్టేషన్లు:30మొత్తం ఓటర్లు:24,606పోలైన ఓట్లు:16,336 టీడీపీ మూకల దౌర్జన్యం.. ఓటర్లు భయభ్రాంతులుమా ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదు: మెట్‌నూతనపల్లి గ్రామస్థులుఓటు వేయడానికి వస్తే ఓటర్ స్లిప్ తీసుకుని తరిమేశారుబయట వ్యక్తులు వందలాదిగా వచ్చి ఓట్లు వేస్తున్నారుమేము చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోతున్నాంవైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టు వైఎస్సార్సీపీ నేతలను అక్రమ అరెస్టు చేస్తున్న అన్నమయ్య జిల్లా పోలీసులు వైఎస్సార్సీపీ నేతలు అంజాద్ భాష, రవీంద్రనాథ్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రహస్య ప్రదేశానికి తరలిస్తున్న పోలీసులు ప్రజాస్వామ్యం ఖూనీ : మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషదాడి చేసిన అధికార పార్టీ నేతలు కాకుండా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడం దారుణంమంత్రి రాంభూపాల్ రెడ్డి యదేచ్ఛగా పోలింగ్ బూతులకు వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిఅయినా వారిపై చర్యలు లేవు ఈరోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందిపోలీసులు పచ్చ పార్టీ కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారుపోలీసులు వ్యవహరిస్తున్న తీరు సమాజానికి మంచిది కాదు దుర్యోధనుడు జూదంలో గెలిచాడు..కానీ..చివరికి :గోరంట్ల మాధవ్ ప్రజా స్వామ్యం అపహాస్యం చేస్తూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు చేశారుపోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకున్నారుపోలీసులు కాళ్లకు ఓటర్లు మొక్కుతున్నారుదొంగ ఓటర్లు గ్రామాల్లో యదేచ్ఛగా ఓట్లు వేస్తున్నారుస్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారు..ఇప్పుడు ఇంట్లో నిర్బంధించారుదుర్యోధనుడు జూదంలో గెలిచాడు..కానీ..చివరికి పాండవులే గెలిచారుప్రజాస్వామ్యం ఖూనీ చేసే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారుపోలీసు అధికారులకు నా విజ్ఞప్తి, ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందిజడ్పీటీసీ ఉప ఎన్నికలు పై కోర్టుకు వెళ్తాం, రీపోలింగ్ కోరతాంజమ్మలమడుగు ,కమలాపురం చెందిన వారితో దొంగ ఓట్లు వేయించారుపులివెందుల జెడ్పీటిసీ ఉప ఎన్నికలు నిర్వహణ తీరు ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టుచంద్రబాబు కుట్ర పూరితమైన ఎన్నికల తీరుపై మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారుపోలిసులు, ఈసీ కూటమి ప్రభుత్వానికి లొంగి ఊడిగం చేయడం బాధాకరంఎంపీ అవినాష్ రెడ్డితో అచ్చివెల్లి గ్రామస్తుల భేటీతమను ఓటు వేయనీయకుండా టిడిపి గుండాలు అడ్డుకున్నారు.ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారు కర్రలు కత్తులతో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు పోలింగ్ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారువచ్చిన వాళ్లంతా ఇతర ప్రాంతాల నుంచి మా గ్రామంలోకి వచ్చారు మా గ్రామంలో 600 ఓట్లకు గాను 300 మంది గుండాలను మోహరించారు మా ఓటు హక్కును అడ్డుకునే అధికారం టీడీపీ నేతలకు ఎవరు ఇచ్చారు గతంలో ఎన్నడు ఇటువంటి దౌర్జన్యాలు జరగలేదు. మహిళలను కూడా చూడకుండా బూతులు తిట్టారు.. చంపుతామని బెదిరించారుఎంపీ అవినాష్ రెడ్డితో అచ్చివెల్లి గ్రామస్తులు ఒంటిమిట్టలో అరగంట పాటు నిలిచిన పోలింగ్పోలింగ్ కేంద్రంలో దొంగఓట్లు వేస్తున్న టీడీపీ నేతలు పోలింగ్ బూత్ లోపల టీడీపీ నేతల్ని నుంచి ఉంచి గడియపెట్టిన పోలీసులు పోలింగ్ కేంద్రం గేటు బయటే వైఎస్సార్సీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రంలో టీడీపీ దొంగఓట్లు వేయిస్తోందంటూ ఆందోళనలోపలికి రానివ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు గందరగోళంతో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో అరగంటపాటు పోలింగ్ నిలిపివేత ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్వైఎస్సార్సీపీ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్స్ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశాంఐదు గంటల వరకు అదుపులోనే ఉంటారురిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండిఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పిటిసి అభ్యర్థి అరెస్టుకు యత్నంఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డి ఆఫీసుకు చేరుకున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.ఎస్పీతోపాటు సుమారు 150 మంది పోలీసులుసుబ్బారెడ్డి ఆఫీస్‌లో వైఎస్సార్సీపీ నేతలు రవీంద్ర నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అమ్జాద్ భాష, కొరుముట్ల శ్రీనివాసులు వైఎస్సార్సీపీ నేతలతో మాట్లాడుతున్న ఎస్పీవైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నంపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వైఎస్సార్సీపీ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులులోపలి వారిని బయటకు, బయటి వారిని లోపలికి అనుమతించని వైనంగేటు వద్ద మహిళలు ఆందోళనమా కార్యాలయంలోకి పంపడానికి ఇబ్బంది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్న కార్యకర్తలు..పులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయంలో పోలీసుల వీరంగంపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న పోలీసుల వీరంగం పార్టీ గేటు వద్ద లోపలికి కార్యకర్తలను ఎవరినీ రానివ్వకుండా గేట్లు వేసి అడ్డుకుంటున్న పోలీసులుమహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న పోలీసులుతమ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి వద్దకు వెళ్లాలంటూ పోలీసులతో వాదనకు దిగిన మహిళలుఅయినా అడ్డుకుంటున్న పోలీసులు..ఒంటిమిట్ట జడ్పీ హైస్కూల్ వద్ద ఉద్రిక్తతటీడీపీ నేతలను లోపలికి పంపి ఓట్లు వేయిస్తున్న పోలీసులువైఎస్సార్‌సీపీ నేతలను గేటు వద్ద అడ్డుకున్న పోలీసులుగేట్లు తోసుకొంటూ లోపలికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు కనంపల్లిలో పోలీసుల ఓవరాక్షన్ సర్పంచ్ రామాంజనేయులు ఇంట్లో గన్ ఉంచి బెదిరిస్తున్న పోలీసులు కనంపల్లిలో ఓట్లు వేయనియకుండా ఓటర్లును తిప్పిపంపిస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై ఓటర్ల ఆగ్రహం పులివెందులపై పోలీసులు పగబట్టారు: ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారుఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండిఅన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాంకార్యకర్తలు సంయమనం పాటించాలి కలెక్టర్‌కు పులివెందుల జడ్పీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థుల లేఖ పులివెందులలో అరాచకం చేసి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తోందిఏ ఒక్క ఏజెంటునూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లనివ్వలేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన అభ్యర్థులురీపోలింగ్ జరపాలని కలెక్టర్‌ను కోరిన ఇండిపెండెంట్ అభ్యర్థులుఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆఫీస్‌కు భారీగా పోలీసులుపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్వైఎస్సార్సీపీ కార్యకర్తలను దూషించిన పోలీసులుపోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలు ఉదయం 11 గంటల వరకు 38.64 శాతం నమోదుపులివెందుల:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 15మొత్తం ఓటర్లు: :10,601పోలైన ఓట్లు: 4803ఓట్ల శాతం: 45.31ఒంటిమిట్ట:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 30మొత్తం ఓటర్లు: 24,606పోలైన ఓట్లు: 9057 ఎర్రగుంట్లలో వైఎస్సార్సీపీ నేతల భారీ ర్యాలీపోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనపులివెందులలో యథేచ్ఛగా రిగ్గింగ్: వైఎస్ అవినాష్రెడ్డిజమ్మలమడుగు టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారుకొత్తపల్లిలో బీటెక్ రవి అనుచరులు రిగ్గింగ్ చేశారుమా పార్టీ ఏజెంట్లను కొట్టి బయటకు పంపారుఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్న పట్టించుకోలేదుపులివెందుల మండల ఓటర్లతో రిగ్గింగ్ చేయించడం అసాధ్యంఅందుకే బయట నుంచి దొంగ ఓటర్లను దింపారుపులివెందులలో దౌర్జన్యాలతో ఎవరూ గెలవలేరుదాడులు చేసి గెలిచామనకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదుఎర్రిపల్లిలో బీటెక్ రవి తమ్ముడు మహిళలను కొట్టాడుపోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ బయటకు తీయాలితప్పు చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాంమంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరుల వీరంగంచిన్న కొత్తపల్లిలో మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై చేయి చేసుకున్న టీడీపీ నేతలుఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులుకట్టెలతో కొడుతున్నారంటూ వాపోతున్న ఓటర్లుప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిసుబ్బారెడ్డిపై దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్తలుబూతు పురాణం అందుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డిమంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనఓటర్లను ప్రలోభపెట్టేలా మంత్రి పర్యటనఒంటిమిట్ల పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన మంత్రిదొంగ ఓటు వేసిన జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ ఛైర్మన్నల్లపురెడ్డి బూత్ క్యూలైన్లో వైఎస్ ఛైర్మన్మరో బూత్ క్యూలైన్లో వేంపల్లికి చెందిన దొంగ ఓటరుక్యూ లైన్లో జమ్మలమడుగు వాసులను గుర్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులుపులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లుప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలుక్యూల్లో నిలబడి వారే ఓట్లేస్తున్న వైనంక్యూ లైన్లలో అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు అయినా పట్టించుకోని పోలీసులుపోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటరు స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు వాళ్లను పంపుతున్న టీడీపీ నాయకులుదొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు, వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదని పంపుతున్న టీడీపీ నాయకులునల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలుగ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని టీడీపీ నేతలుకర్రలు, రాడ్లతో పహారా, పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్రఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రాకుండా అడ్డగింత...గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులను చేసిన టీడీపీ మూకలుమీడియాను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్న టీడీపీ గూండాలుప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్...దొంగ ఓటర్లతో నిండిపోయిన పోలింగ్ బూత్లుటీడీపీ అరాచకాల ఆధారాలను ప్రదర్శించిన వైఎస్సార్సీపీ నేతలుప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలువిజయవాడ: ఎస్ఈసీ కార్యాలయానికి వైఎస్సార్సీపీ నేతలుపులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదుతక్షణమే స్పందించాలంటూ ఈసీ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నేతల నిరసనఎన్నికల కమిషనర్‌ను కలిసిన మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్..మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డిమొండితోక అరుణ్ కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డిఎస్పీకి ఫోన్ చేసినా కానీ పట్టించుకోలేదుపులివెందుల జడ్సీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహంమా ఇంటి చుట్టూ 150 పోలీసులను పెట్టారుమా ఏజెంట్లు వస్తే కాళ్లు చేతులు విరిచేస్తామంటూ బెదిరించారుఇంటి నుంచి 100 మీటర్ల దూరంలో 100 మందిపైగా టీడీపీ రౌడీ మూకలుఇక్కడ ఉండేది 1200 ఓట్లు.. బయట నుండి వచ్చి 900 మంది రౌడీలు తిరుగుతున్నారు144 సెక్షన్ ఉందన్నా.. బయటకు వాళ్ళకు వర్తించదా?పోలీసులు దగ్గరుండి ఓట్లు వేయించిస్తున్నారునేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదుప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలిగెలుపు ఓటములు సహజంపులివెందులను భ్రష్టు పట్టిస్తున్నారుతప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తున్నారుఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలిఎస్పీకి ఫోన్ చేసిన ఇంతవరకు రెస్పాన్స్ లేదుపోలీసుల తీరుపై ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డి ఆగ్రహంపూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా జడ్పీటీసీ ఎన్నికలురాయచోటి నుంచి ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీ మూకలను తరలించి ఎన్నికలకు అంతరాయం కలిగిస్తున్నారుప్రతి బూత్ వద్ద బయటి వ్యక్తులు 50కి పైగా ఉన్నాకానీ.. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారుఆ బయట వ్యక్తులు ఉన్నారని పేరుతో సహా చెప్పిన పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారు..పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారుప్రజాస్వామ్యం పద్ధతులకు విరుద్ధంగా ఎన్నికలు జరిగితే దానికి ఎస్పీఏ బాధ్యులవుతారుఉదయం 9 గంటల వరకు 14.87 శాతం నమోదుపులివెందుల:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 15మొత్తం ఓటర్లు: :10,601పోలైన ఓట్లు: 2,222ఓట్ల శాతం: 20.96ఒంటిమిట్టమొత్తం పోలింగ్ స్టేషన్లు: 30మొత్తం ఓటర్లు: 24,606పోలైన ఓట్లు:3,658 మహిళల అడ్డగింతతో.. వెనుదిరిగిన పోలీసులువైఎస్సార్ జిల్లా తుమ్మలపల్లి లో వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులుఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులు‘‘మీరు టీడీపీ వారికే కాపలా.. పోండి’’ అంటూ అడ్డుకున్న మహిళలుఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్ కి సహకరిస్తూ ఇప్పుడు అభ్యర్థి ఓటు అంటూ వస్తారా? అని ఆగ్రహంఅసలు ప్రజలనే ఓటు వేయనీయకుండా చేసి ఇక్కడి వచి నీతులు చెప్తారా? అంటూ అడ్డగింతమహిళల అడ్డగింతతో వెనుతిరిగిన పోలీసులుఆ పది మంది టీడీపీ వాళ్లే!పులివెందుల ఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ అరాచకంపోలింగ్ బూత్ ల నుంచి ఓటర్లను వెనక్కి పంపుతున్న టీడీపీ నేతలుపోలింగ్ బూత్ లను ఆక్రమించిన టీడీపీ నేతలు.పోలీసులను అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్న వైనంటీడీపీ అరాచకాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలుఓన్లీ ఎల్లో మీడియా చానల్స్ ను మాత్రమే పోలింగ్ బూత్ లోకి అనుమతిపదిమంది టీడీపీ ఓటర్లను క్యూ లైన్లో నిలబెట్టి వీడియోలు తీయిస్తున్న టీడీపీఎన్నిక సక్రమంగా జరిగిందంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం పులివెందుల-నల్లపురెడ్డి గ్రామానికి చెక్ పోస్ట్ఓటర్లకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు నో ఎంట్రీటీడీపీ నాయకుల కార్లు అయితే రైట్ రైట్ఒంటిమిట్టలో టీడీపీ అరాచకంకొనరాజుపల్లి కి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు10 జీపుల్లో బయట నుండి వచ్చిన టీడీపీ శ్రేణులుభారీ ఎత్తున రిగ్గింగ్ కోసం ప్రయత్నాలు ఒంటిమిట్టలో టీడీపీ అరాచకంగొల్లపల్లి , నరసనగారి పల్లి పోలింగ్ బూత్ హేండ్ ఓవర్ చేసుకున్న టీడీపీ శ్రేణులుఓట్లు వేసుకొంటున్న టీడీపీ శ్రేణులుపోలింగ్ బూతుల నుండి వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటికి లాగేసిన టీడీపీ శ్రేణులుచోద్యం చూస్తున్న పోలీసులుటీడీపీ రిగ్గింగ్‌పై ఆగ్రహజ్వాలలుపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్కనంపల్లిలో వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాల్లో టీడీపీ ఇష్టారాజ్యంఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని మహిళల గ్రహంపోలీసుల కాళ్లు పట్టుకుంటున్న ఓటర్లుపులివెందుల నల్లగొండు వారి పల్లె లో ఓటర్ల ఆందోళనఓటు వెయ్యనివ్వండని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్న ఓటర్లుటీడీపీ నేతలు రిగ్గింగ్ చెయ్యడం తో నిజమైన ఓటర్ల ఆందోళనపోలీసులు కి వేడుకుంటున్న ఓటు హక్కు వినియోగించుకొని దుస్థితిఓటరు స్లిప్పులు లాక్కుంటున్న టీడీపీ నేతల పై ఓటర్ల ఆగ్రహం👉లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు: ఎస్వీ సతీష్రెడ్డివేంపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి హౌస్ అరెస్ట్నేడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: ఎస్వీ సతీష్‌రెడ్డి లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు లోకేష్ ఆనందం కోసం చంద్రబాబు ధృతరాష్ట్రుడు అయ్యాడు ప్రజాస్వాయం అవహేళనకు గురవుతుంటే చంద్రబాబు లోకేష్ ఆనందిస్తున్నారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు పులివెందులలో ఉన్న పోలీసులకు ఖాకి చొక్కా వేసుకునే అర్హత లేదునేటి పోలింగ్ జరుగుతున్న తీరుతో ప్రజాస్వామ్యం మీద ఆందోళన కలిగిస్తోంది పరిస్థితి ఈ విధంగా ఉన్నాక పోలింగ్ నిర్వహణ ఎందుకు?👉పులివెందులలో మహిళా ఓటర్ల ఆవేదనఓటేయకుండా అడ్డుకుంటున్నారుఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారుమీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారంటూ నానా హంగామా చేశారుఓటర్ స్లిప్పులను లాక్కున్నారుఓటేయడానికి వెళ్లే ఇక అంతే సంగతులు అంటూ హెచ్చరించారుఈస్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదువందల మంది స్థానికేతర రౌడీలు మా ఓట్లను వేస్తున్నారు.👉పులివెందులలో టీడీపీ ఇష్టారాజ్యంఅన్ని పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్చేస్తున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాల చేతిలో నల్లపురెడ్డి పోలింగ్ స్టేషన్జమ్మలమడుగు నుంచి మనుషుల్ని పిలిపించి రిగ్గింగ్అందరి ఓట్లు వాళ్లతోనే వేయిస్తున్న పచ్చగూండాలు👉కనంపల్లిలో గ్రామస్తులను ఓట్లు వేయనివ్వని పోలీసులుఓటు వేయనివ్వండంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్న ఓటర్లుఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు: స్థానికులుదగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారుబయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాలకే సపోర్ట్ చేస్తున్న పోలీసులు👉పులివెందుల మండలం కనంపల్లి గ్రామంలో ఉద్రిక్తతపోలింగ్ బూత్‌లకు వెళ్ల నియ్యకుండా అడ్డుకుంటున్న టీడీపీ మూకలుఓటు వేయడానికి వెళ్తున్న మహిళ ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ మూకలుతమ ఓటు హక్కును అడ్డుకోవడానికి మీరెవ్వరు అంటూ పచ్చ మూకలపై తిరగబడ్డ మహిళలుకనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు బయటికి రానివ్వకుండా బెదిరిస్తున్న పోలీసులు👉నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా రిగ్గింగ్వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలువిచ్చలవిడిగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ గూండాలు👉ఆర్. తుమ్మలపల్లిలో అరాచకంవైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలుఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకున్న టీడీపీవైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలాఎస్ఫీకి కాల్ చేసినా కనిపించని ఫలితంహేమంత్ గన్‌మెన్‌ని ఉన్న పళంగా మార్చేసిన అధికారులునిన్నటి వరకు ఉన్న గన్‌మెన్‌ను తొలగించి మరొకరిని పంపిన అధికారులుబయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ నేతలుటీడీపీ గూండాలకే వత్తాసు పలుకుతున్న పోలీసులు👉టీడీపీ గూండాల అరాచకాలపై పట్టించుకోని పోలీసులుపులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహందాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారుటీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారుఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారునా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారుకర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారుదాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారుఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు👉ఈ కొత్తపల్లిలో రెండు పోలింగ్ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ నేతలుఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ నేతల దౌర్జన్యంటీడీపీ ఓటర్లను తప్ప మిగతా వారిని ఓటు వేయడానికి అనుమతించని టీడీపీ నేతలుఓటు వేయడానికి వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్న టీడీపీ గుండాలునిస్సహాయంగా వెనక్కి తిరిగిపోతున్న ఓటర్లుఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాముదౌర్జన్యంగా వెనక్కి పంపించేశారుగతంలో ఎన్నడు బూతులను ఆక్రమించలేదుపోలింగ్ బూత్‌ల్లో పులివెందులకు సంబంధించిన వ్యక్తులు లేరుబయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే పోలింగ్ బూత్‌ల్లో ఉన్నారుపోలీసులు వారికే కొమ్ము కాస్తున్నారుఒక్క బూత్‌లో కూడా పోలీసులే లేరుమా గ్రామాల్లో ఓటు వేయకుండా, పక్క గ్రామంలో బూత్‌లు మార్చారుఎప్పుడు బూతులు మార్చిన దాఖలాలు లేవంటున్న ఓటర్లు👉పులివెందులలో మీడియాపై దాడికి దిగుతున్న కూటమి నేతలుపోలింగ్ బూత్ లను ఆక్రమించి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని అల్లరి మూకలుఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్న టీడీపీ మూకలుప్రతి గ్రామంలో 300 మందికి పైగా అల్లరి మూకలుమీడియాను సైతం వదలని టీడీపీ మూకలుమీడియా ప్రతినిధులను గ్రామం బయటే అడ్డుకుని కెమెరాలు లాక్కుంటున్న వైనంసాక్షి ప్రతినిధులపై దాడికి దిగిన టీడీపీ గూండాలువైఎస్సార్సీపీ ఏజెంట్లను అసలు బూత్ లోపలికి వెళ్లనివ్వని టీడీపీ👉పులివెందుల, ఒంటిమిట్లలో ప్రజాస్వామ్యం ఖూనీపోలింగ్ బూత్‌ల్లో టీడీపీ గూండాల స్వైర విహారంవైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలుమీడియా ప్రతినిధులపైనా టీడీపీ గూండాల దాడులుటీడీపీ గూండాల అరాచకాలను పట్టించుకోని పోలీసులు👉పులివెందులలో టీడీపీ గూండాల దౌర్జన్యంఅచ్చివెల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుక్ను టీడీపీ గూండాలుఎర్రిపల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాల అరాచకాలతో గ్రామాల్లో భయాందోళనలునిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్తున్న ఓటర్లుటీడీపీ గూండాలు దౌర్జన్యంగా వెనక్కి పంపేశారని ఆవేదనగతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదంటున్న ఓటర్లుపోలింగ్ బూత్‌ల్లో బయటి వ్యక్తులు ఉన్నారంటున్న ఓటర్లుఒక్క పోలింగ్ బూత్‌లో కూడా పోలీసులు లేరంటున్న ఓటర్లు👉పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభంతీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన పోలింగ్ఎక్కడికక్కడే పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలువైఎస్సార్సీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలుగ్రామాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్న పచ్చ మూకలు👉పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఉద్రిక్తతపోలింగ్ బూత్ ను ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ మూకలుపోలీసులను సైతం తరిమేస్తున్న టీడీపీ మూకలుగ్రామంలో మహిళలపై దాడి.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న పచ్చ మూకలుగ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ👉పులివెందుల మండలంలో భయానక పరిస్థితులువైఎస్సారసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి హౌస్అరెస్ట్వేంపల్లిలోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులువైఎస్సార్‌సీపీ నేతల కార్లను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలుమౌన ప్రేక్షక పాత్రలో వందలాది మంది పోలీసులుగ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు👉ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్తెల్లవారుజామున అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులుఇంటికొచ్చి బలవంతంగా అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులుఎన్నికలు జరిపే విధానం ఇదేనా?: అవినాష్రెడ్డిమా కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారుకేవలం వైఎస్సార్సీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారుపోలీసులు గూండాలుగా వ్యవహరిస్తున్నారుఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు👉వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.👉ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్‌లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.👉ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్‌ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది.ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం. -
పులివెందుల రణరంగం..
-
ఒంటిమిట్టలో YSRCP భారీ ర్యాలీ
-
ప్రజలు జగనన్నను కోరుకుంటున్నారు.. భారీ మెజారిటీతో గెలుస్తాం
-
ఒంటిమిట్ట : కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం (ఫోటోలు)
-
అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం
-
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం (ఫొటోలు)
-
ఒంటిమిట్ట రథోత్సవానికి జగన్... అవినాష్ రెడ్డి కారిటీ
-
వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఒంటిమిట్టలో ధ్వజారోహణ కార్యక్రమం
-
భక్తజనం మధ్య వైభవంగా దేవుని కడప క్షేత్రంలో రాయుని రథోత్సవం (ఫొటోలు)
-
ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామస్వామి కల్యాణం (ఫొటోలు)
-
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఒంటిమిట్టకు పోటెత్తిన జనం
-
పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట రాములోరి కల్యాణం (ఫొటోలు)
-
సీఎం జగన్‌కు కాలినొప్పి.. ఒంటిమిట్ట పర్యటన రద్దు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాలినొప్పి కారణంగా రేపటి వైఎస్సార్ జిల్లా పర్యటన రద్దు అయ్యింది. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ఆయనకు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి పెరిగింది. గతంలో ఇలానే కాలికి గాయం కాగా, చాలా రోజులపాటు సీఎం ఇబ్బందిపడ్డారు. తాజాగా మళ్లీ కాలినొప్పి రావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చదవండి: 2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే.. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2023 5న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు: ఈ నెల 5న ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. మళ్లింపు ఈ నెల 5 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలు అనుమతించరని ఎస్పీ తెలిపారు. వాహనాల దారి మళ్లింపు వివరాలు: ►కడప నుండి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి ఇర్కాన్ జంక్షన్ నుండి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్ళాలి ►తిరుపతి నుండి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుండి దారి మళ్లింపు.. వయా రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి ►రాజంపేట వైపు నుండి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు ►రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ నుండి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా దారి మళ్లింపు 15 చోట్ల పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు ►రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను సాలాబాద్ సమీపంలో 5 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి ►కల్యాణ వేదిక నుండి కడప మార్గంలో 10 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు -
రేపు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
కడప సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాలోని ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరై స్వామి వారిని దర్శించుకోనున్నారు. అదేరోజు తిరిగి సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తాడేపల్లికి వెళ్లనున్నారు. పర్యటన వివరాలిలా.. ఈనెల 5వ తేదీన ► మధ్యాహ్నం 12.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళతారు. ► 1.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ► 2.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.35 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు. ► 2.40 నుంచి 3.15 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ► 3.25 గంటలకు టీటీడీ అతిథి గృహం నుంచి బయలుదేరి కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు. ► 3.30 నుంచి 3.50 గంటల వరకు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ► 3.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి టీటీడీ అతిథి గృహానికి చేరుకుని 4.20 గంటల వరకు అక్కడే ఉంటారు. ► 4.25 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ► యంత్రం 5.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 6.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
నేటి నుంచి ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మార్చి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాటు చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం అంకురార్పణతో ప్రారంభమై.. ఏప్రిల్ 9వ తేదీ పుష్పయాగంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్ 5న ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. -
ఒంటిమిట్ట రామయ్య హుండీ లెక్కింపు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆగస్టు నెలకు సంబంధించి నెల వారి హుండీ ఆదాయం రూ. 7 లక్షల 83 వేల 142 వచ్చినట్లు సోమవారం ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ రంగమండపంలో టీటీడీ సిబ్బంది ద్వారా హుండీలోని కానుకలను లెక్కించారు. నిత్యపూజ స్వామి ఆలయంలో.. సిద్దవటం : వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నిత్య పూజస్వామి హుండీ ఆదాయం రూ.1,76,803 వచ్చిందని ఆలయం ఈఓ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జూలై 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను దేవదాయ శాఖకు చెందిన కడప సూపర్వైజర్ ఎస్. జనార్దన్ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో సోమవారం మధ్యాహ్నం లెక్కించామన్నారు. రూ. 1,76,803 నగదు, 191 గ్రాముల బంగారం, 1.700 గ్రాముల వెండి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండారెడ్డి, ఆలయ సిబ్బంది చంద్ర, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రెడ్డెమ్మకొండ ఆదాయం రూ. 7 లక్షలు గుర్రంకొండ : మండలంలోని సంతానదేవత శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,00,121 ఆదాయం సమకూరింది. సోమవారం స్థానిక ఆలయంలో మదనపల్లె దేవదాయశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో మూడు నెలల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదు రూపంలో రూ. 7,00,121, బంగారు నగలు 20 గ్రాములు, వెండికానుకలు 489 గ్రాములు వచ్చినట్లు లెక్కతేల్చారు. హుండీ ఆదాయాన్ని గుర్రంకొండ గ్రామీణబ్యాంకులో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈఓ మంజుల, ,సిబ్బంది పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట.. రైలు ఆగేదెట!
రాజంపేట: రాష్ట్రంలో వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట (ఏకశిలానగరం) కోదండరాముని భక్తులపై..స్టేషన్ అభివృద్ధిపై రైల్వే చిన్నచూపు ప్రదర్శిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం రామునిక్షేత్రంగా వెలుగొందింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒంటిమిట్ట ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది. 2014లో ఏపీ ప్రభుత్వం దీనిని అధికారిక ఆలయంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకుని వందకోట్లకుపైగా వ్యయంతో క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. అయితే రైల్వేశాఖ, రైల్వేమంత్రిత్వశాఖ ఒంటిమిట్టకు నలుదిశల నుంచి ప్రయాణికులు క్షేత్రానికి వచ్చేలా సౌకర్యాలు కల్పించడంలో వివక్షను ప్రదర్శించింది. ఒంటిమిట్టను గుర్తించని దక్షిణమధ్య రైల్వే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను గుర్తించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను దక్షిణమధ్యరైల్వే గుర్తించలేదు. ముంబై–చెన్నై కారిడార్ రైలు మార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణమధ్యరైల్వేలోనే ఉండేవి. భద్రాచలం స్టేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడంలేదంటే వివక్ష ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్ పేరుకు మాత్రమే ఉంది. ఇక్కడ డెమై రైలు తప్ప ఏ రైలుకు స్టాపింగ్ లేదు. నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. తాజాగా ఒంటిమిట్ట స్టేషన్‌కు ఎఫ్ఓబీకి బ్రేక్ ఒంటిమిట రైల్వేస్టేషన్లో డబుల్ ఫ్లాట్‌ఫాంలు ఉన్నాయి. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్ధ్యం ఫుట్ఓవర్ బ్రిడ్జిని(ఎఫ్ఓబీ) రైల్వేబోర్డు మంజూరు చేసింది. గుంతకల్ డివిజన్లో మూడుచోట్ల మంజూరు చేస్తే, అందులో ఒంటిమిట్ట ఒకటి కావడం గమనార్హం. సెకండ్ప్లాట్ఫాంకు వెళ్లాలన్నా, అటువైపు పల్లెలోకి వెళ్లాలన్న ఎఫ్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఉంది. నిధులు వెనక్కి వెల్లకుండా అధికారులు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్
కడప: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలోనే 108 అంబులెన్స్ రావడంతో దానికి దారిచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకులకు హాజరయ్యే క్రమంలో కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన కాన్వాయ్‌లో వెళుతున్న సమయంలో వైఎస్సార్ సర్కిల్ వద్ద ఒక అంబులెన్స్ వెనకాలే వచ్చింది. అంబులెన్స్ సైరన్ వినగానే దానికి దారివ్వలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్. దాంతో అధికారులు కాన్వాయ్‌ను ఒక పక్కకు ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. ఆపై సీఎం జగన్ ఒంటిమిట్టకు చేరుకుని కోదండ రాముని కల్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. -
కల్యాణానికి సర్వం సిద్ధం.. సీఎం జగన్ పర్యటన వివరాలిలా..
సాక్షి, ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం టీటీడీ ఈఓ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఒంటిమిట్టలోని స్వామి వారి కల్యాణ వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటలవరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. భక్తులందరికి అక్షింతలు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, ఈఎంసీ సీఈఓ గౌతమి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. కడప కార్పొరేషన్: ఈనెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 7.30 నుంచి 7.40 గంటల వరకు కోదండరామస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సీతారాముల కల్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. 8.00 నుంచి 10.00 గంటల వరకు జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకిస్తారు. తర్వాత రోడ్డు మార్గాన ఒంటిమిట్ట నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు కడపలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు, 16వ తేదీ శనివారం ఉదయం 9.10 గంటలకు కడప ఎన్జీఓ కాలనీలో నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి పాత బైపాస్‌లో ఉన్న ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుంటారు. 9.30 నుంచి 9.45 గంటల వరకు కడప నగర మేయర్ సురేష్‌బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ ముందస్తు వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి కడపకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలుజిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వెళతారు. -
ఒంటిమిట్టలో ఘనంగా కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
ఒంటిమిట్ట.. విశేషాల పుట్ట..
ఏకశిలానగరి.. విశేషాల ఝరి.. ఇక్కడి కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక, రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ, లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. – ఒంటిమిట్ట/కడప కల్చరల్ రామతీర్థం.. నేటికీ పదిలం రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది. కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తరువాత బుగ్గను రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వచ్చింది. కానీ ఈ రామతీర్థంలో స్వామికి చక్రస్నానం చేయించుటకు స్థలం సరిపోకపోవడంతో కోదండ రామాలయం ఎదురుగానే నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి చక్రస్నానం జరుపుతారు. జాంబవంతుడి ప్రతిష్ట ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. రామయ్య నడయాడిన నేల శ్రీ రామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ, సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు, యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది. హనుమ లేని రాముడి కోవెల హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు. విదేశీ మెచ్చుకోలు క్రీ.శ. 1652లో భారత యాత్ర చేసిన టావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు భారత దేశంలోని గొప్ప (పెద్దదైన) ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒకటి అని మెచ్చుకుని ప్రశంసించారు. ఇది అద్భుతమైన క్షేత్రమని ఆయన పేర్కొన్నారు. వెన్నెల్లో కల్యాణం శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ, భరత, శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి. చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కల్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కల్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కల్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం. రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కల్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒంటిమిట్ట చెరువు జిల్లాలోని పెద్ద చెరువులలో ఒంటిమిట్ట చెరువుకు ప్రత్యేకత ఉంది. ఒంటిమిట్టకు వచ్చిన వారితోపాటు ఆ రోడ్డున వెళ్లే వారు ఈ చెరువును చూసే ఉంటారు. మెయిన్రోడ్డునుంచి కనుచూపుమేర విశాలంగా కొండల వరకు విస్తరించి ఉన్న ఆ చెరువుకు గొప్ప చరిత్ర ఉంది. కడప కైఫీయత్తుల సమాచారం మేరకు .. 1340లో కంపరాయులు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగమైన ఉదయగిరికి పాలకుడిగా ఉన్నారు. తన పరిధిలోని ప్రాంతమంతా స్వయంగా పర్యటిస్తూ అవసరమనిపించిన చోట దేవాలయాలు, చెరువులు నిర్మింపజేశారు. ఆయన నిర్మించిన చిట్వేలి చెరువు వద్దగల కంపసముద్రం అగ్రహారం, నెల్లూరు జిల్లాలోని కంపసముద్రం తదితర ప్రాంతాలు నేటికీ ఆయన పేరుతోనే ఉన్నాయి. తన పాలనలో ఆయన అటు ఆధ్యాత్మిక, ఇటు సామాజిక సేవలు అందించారు. ఒంటిమిట్ట ప్రాంతం 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు–మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి, ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు, మిట్టడులకు అప్పగించారు. గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద, చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు. కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది. పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు, లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు. కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కల్యాణ వేదికపై కల్యాణం నిర్వహిస్తారు. కాగా ఈ ఆలయం టీటీడీలోకి విలీనమైంది. 2016 నుంచి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కల్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు. రామయ్య రథం కథ ఇదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి. 1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. తొలి బ్రహ్మోత్సవాలలో శిల్పులు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యంగల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు, ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డుచెప్పారు. రథ శిల్పులు కూడా పట్టువీడలేదు. తాము రథంపై కూర్చొవాల్సిందేనని పట్టుబట్టారు. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసింది. ఆయన వెంటనే ఒంటిమిట్టకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులను ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాలను గమనించారు. రథాన్ని నిర్మించిన రథ శిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చొనే సంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది. ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది. రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. అయ్యల రాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది. ► అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారా లు చెబుతున్నాయి. రామాభ్యుదయం కా వ్యం ఆయన కలం నుంచి జాలువారింది. ► బమ్మెర పోతనామాత్యుడు మహాకవి. భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు. ► వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ► కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. ► వర కవి నల్లకాలువ అయ్యప్ప, ఉప్పు గొండూరు వెంకట కవి, మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. రాచరికం.. రాజసం క్రీ.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సోదరుడు కంపరాయులు ఉదయగిరిని పాలిస్తూ ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఒంటడు, మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవారు. వీరిద్దరు రాజులతో పాటు ఆయన వెంట వచ్చిన బృందానికి వసతి కల్పించారు. వారిద్దరు చెరువు, రామాలయం నిర్మించాలని కంప రాయులను అడిగారు. వారి కోరిక మేరకు వాటిని నిర్మించేందుకు ఆయన కృషి చేశారు. ఒంటడు, మిట్టడు కట్టిన ఆలయం కనుక ఈ ఆలయానికి ఒంటిమిట్ట కోదండరామాలయం అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది. ► క్రీ.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం, ఎదుర్కోలు మండపాలు, ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. -
కల్యాణం నేపథ్యంలో.. 15న ట్రాఫిక్ మళ్లింపు
కడప అర్బన్: ఒంటిమిట్టలో ఈనెల 15న సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలను అనుమతించరని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాహనాల మళ్లింపు వివరాలు ఇలా.. ► కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్‌పల్లి, ఇర్కాన్ సర్కిల్ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి. ► పులివెందుల నుంచి కడప నగరానికి, కడప మీదుగా వెళ్లే వాహనాలను సాక్షి సర్కిల్ నుంచి ఊటుకూరు సర్కిల్ వైపు దారి మళ్లిస్తారు. ► తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి. ► రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా మళ్లిస్తారు. ► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సాలాబాద్ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా దారి మళ్లిస్తారు. ► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను సాలాబాద్ సమీపంలో 15 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి. ► కల్యాణ వేదిక నుంచి కడప మార్గంలో 10 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలకు విచ్చేయాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలను టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్ రమణ ప్రసాద్.. సీఎం జగన్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 15న జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ, ప్రసాదాలు అందించారు. కాగా 15 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు పున్నమి వెన్నెల్లో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. టీ -
తహశీల్దార్ కార్యాలయంలో కత్తులతో దాడి
సాక్షి, వైఎస్సార్ : వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట తహశీల్దార్ కార్యాలయంలో భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంలో అక్కడే ఉన్న అనిల్‌కుమార్ రెడ్డి వర్గీయులు నరసింహారెడ్డి వర్గీయులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. కాగా ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రేమ పెళ్లి.. అడ్డంగా బుక్కైన జంట
సాక్షి, కడప : ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భయపడ్డారు. ఇందుకోసం స్నేహితుల సహకారంతో గుడిలో వివాహం చేసుకునేలా పథకం రచించారు. అనుకున్న ప్రకారం తమ ప్లాన్ అమలు చేశారు. మరికొద్ది సేపట్లో తంతు ముగిసేదే.. ఇంతలో అనుకోని విధంగా వారి పెళ్లి పెటాకులైంది. వివరాలు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ ప్రేమ జంట రహస్య వివాహం చేసుకోవడానికి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చారు. అయితే వారు తీరుతో అనుమానం వచ్చిన అధికారులు, వారి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇద్దరూ మైనర్లుగా ఆలయ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారిని ఒంటిమిట్ల పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రలకు విషయాన్ని తెలిపి, ఒంటిమిట్ట రావాలని సూచించారు. -
ఒంటిమిట్ట కళ్యాణంలో అపశృతిపై అనేక వివాదాలు
-
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల్లో కనీవినీ ఎరుగని బీభత్సం
-
నిండా ముంచిన అకాల వర్షాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : వాతావరణ మార్పులతో వచ్చిన అకాల వర్షాలు ఉద్యాన రైతులను నిండా ముంచేశాయి. గడచిన రెండు రోజులపాటు వీచిన ఈదురు గాలులు, అకాల వర్షంతో రాష్ట్రంలోని ఐదారు జిల్లాల్లో మామిడి పంటతోపాటు అరటి, బొప్పాయి, దోస, కర్బూజ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 50 వేల హెక్టార్లలో మామిడి పంట దెబ్బతిన్నట్టు అనధికార అంచనా. వేలకు వేలు ఖర్చు పెట్టి తోటల్ని సిద్ధంచేస్తే పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది మామిడి పూత రావడమే ఆలస్యం కాగా వచ్చిన పూత నిలవక రైతులు ఆదిలో ఇక్కట్లు పడ్డారు. నానా తంటాలు పడి పూతను నిలుపుకుంటే ఇప్పుడీ అకాల వర్షంతో పిందెలతో సహా సర్వం నేల రాలాయని రైతులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, వి.కోట, గంగవరం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో వడగండ్ల వానకు మామిడి, టమోట, వరి, అరటి.. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాలలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో సుమారు వేయి హెక్టార్ల వరకు మామిడి సహా వివిధ రకాల ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని వల్లూరు, చింతకొమ్మదిన్నె, కడప, కమలాపురం, పెండ్లిమర్రి, చెన్నూరు, రామాపురం, వీరబల్లి, జమ్మలమడుగు, వేంపల్లె, ఖాజీపేట, పుల్లంపేట, దువ్వూరు, సిద్దవటం, కాశినాయన, రాజంపేట, ఒంటిమిట్ట, మైదుకూరు, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, పెనగలూరు, ఒంటిమిట్ట ప్రాంతాల్లో చేతికందివచ్చిన అరటి, బొప్పాయి, మామిడి, టమాటా, దోస, కర్బూజ పంటలకు భారీనష్టం వాటిల్లింది. మొత్తం మీద మార్చి 16న, 30న సంభవించిన గాలివానలవల్ల ఈ జిల్లాలో 6000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. ఇందులో అత్యధికంగా 1,665 ఎకరాలు అరటి తోటలే ఉండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో స్వల్పంగా మామిడి పిందెలు నెలరాలాయి. ఎకరానికి రూ.55 నుంచి రూ.60 వేల వరకు ఖర్చు పెట్టామని, ఈ పరిస్థితుల్లో తమకు పెట్టుబడైనా వస్తుందో లేదోనని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, 12 ట్రాన్స్ఫార్మర్లు, 60 విద్యుత్ స్తంభాలు జిల్లాలో నేలకొరగగా 6 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లాలో రూ.50 లక్షలకు పైగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. యాడికి, ఎన్పీ కుంట, తలుపుల, పుట్లూరు, ఓడీ చెరువు, నార్పల తదితర మండలాల పరిధిలో అరటి, టమాట, మామిడి తోటలు 50 హెక్టార్లకు పైగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే.. నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయాధికారులు రంగంలోకి దిగారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి అకాల వర్షంతో నష్టపోయిన మామిడి రైతులకు ఎకరానికి కనీసం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50 వేలు, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలన్నారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
-
కనీవినీ ఎరుగని బీభత్సం
రాజంపేట/ కడప అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్ర వారం రాత్రి వర్ష బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళన లకు గురి చేసింది. ఇలాంటి దుర్ఘటనను తాము గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా వర్షం, ఈదురు గాలుల ధాటికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. 70 మంది గాయాల పాలయ్యారు. అధికారులు, పోలీసులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ముందస్తు చర్యలేవీ? శుక్రవారం సా.7 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు లేకపోవ డంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై అసహనం వ్యక్తంచేశారు.ఎందుకు అప్రమత్తం కాలేకపోయారని ప్రశ్నిం చినట్లు సమాచారం. మరోవైపు ఒంటిమిట్టలో కల్యాణ వేదిక, రామాలయం పరిసర ప్రాంతాల్లో వర్ష బీభత్సం వల్ల జరిగిన నష్టంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా ఆలయ ధ్వజస్తంభంపైభాగంలో వంకరపోయింది. రామాలయం మూసివేత బలమైన ఈదురుగాలుల ధాటికి రామాల యంలో తాత్కాలిక నిర్మాణాలు కుప్పకూలాయి. దీంతో శనివారం భక్తులకు స్వామివారి దర్శనం సా. 4 గంటల వరకు లేకుండాపోయింది. సంప్రోక్షణ పేరుతో ఆలయ ద్వారాలను మూసివేసిశారు. కోదండ రాముడి ఆలయంలో కూలి పడ్డ చలువ పందిళ్లు తాత్కాలిక నిర్మాణాలవల్లే ప్రాణ నష్టం శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడంపై టీటీడీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్టలో రూ.4.47 కోట్లతో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటుచేశారు. అయితే, శాశ్వత నిర్మాణాల గురించి టీటీడీ పట్టించుకోకపోవడంవల్లే భక్తులు బలి కావాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా వర్ష బీభత్సంవల్ల గాయపడిన వారు కోలుకుంటున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 80 మంది గాయపడగా, వీరిలో 32మంది కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటలో కోడల్ని కోల్పోయాం ‘‘నా పేరు సాంబశివరావు. మాది కృష్ణా జిల్లా పెడన మండలంలోని తెలుగుపాలెం. నాతోపాటు నా భార్య అరుణకుమారి, కోడలు ఎం.మీనాతోపాటు ఐదుగురం వచ్చాం. కల్యాణోత్సవంలో స్వామివారిని చూస్తూ ఆనంద సాగరంలో మునిగిపోయాం. హఠాత్తుగా ఈదరుగాలులు, వర్షం ధాటికి స్తంభాలు నేలకూలాయి. కరెంటు పోయింది. బయట ఉన్న జనమంతా ఒక్కసారిగా లోపలికి తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో నా కోడలు మీనా మృతి చెందింది. స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించి తలంబ్రాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లాల్సిన మేము మృతదేహాన్ని తీసుకుని వెళ్లాల్సి రావడాన్ని తట్టుకోలేకపోతున్నా’’. -
చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ వినాశనం
-
అవి హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్..!
సాక్షి, చెన్నై: వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాల లభ్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తమిళ కూలీల మృతదేహాలను తమిళనాడు పోలీసులకు అప్పగించారు. అయితే వారి మరణం పై తమిళ మానవ హక్కుల సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ తమిళ మానవ హక్కుల సంఘాలు మృతదేహాలను పరిశీలించాయి. అయితే మానవ హక్కుల సంఘాలు పోలీసులను తీవ్రంగా విమర్శించాయి. ఇది ఆంధ్రా పోలీసులు చేసిన హత్యలే అని తమిళ సంఘాలు ఆరోపించాయి. ఈ విషయంపై తమిళనాడు పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం మృతదేహాలను తీసుకెళ్ళుతున్నాం. మా ప్రభుత్వం ఆదేశాల మేరకు భవిష్యత్‌లో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. 3లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన కుటుంబాలను అదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అంతేకాక చనిపోయిన వారికి ఒక్కొక్కరికి మూడు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని తమిళ ప్రభుత్వం ప్రకటించింది. -
ఒంటిమిట్ట చెరువులో మృతదేహాల కలకలం..
-
చెరువు‘మట్టి’లూటీ..!
► ఇటుకబట్టీలకు తరలుతున్న చెరువు మట్టి ► యథేచ్ఛగా అక్రమ రవాణా ► చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు కొందరు టీడీపీ నాయకులు నిన్న మొన్నటి వరకు ఇసుకను తవ్వి రూ. కోట్లను అక్రమంగా సంపాదించారు. ఇప్పుడు వారి కన్ను ‘చెరువు’ మట్టిపై పడింది. సమీప చెరువుల్లోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా కళ్లముందే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఒంటిమిట్ట(రాజంపేట): రాజంపేటలో కృష్ణమ్మ చెరువు, ఒంటిమిట్టలో గం గపేరూరు చెరువు.. ఇలా ఊరికొక చెరువును మట్టిమాఫియా చెరపట్టింది. అధికార అండదండలతో టీడీపీ నా యకులు బరితెగిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా చెరువు మట్టిని తరలిస్తున్నారు. రైతుల పొలా లకని చెప్పి మట్టిని కడప నగర సమీపంలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చెరువులో పూడిక తీత పనులు చేపట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మట్టిని సమీప ప్రాంతంలోని రైతులు తమ పొలాలకు వాడుకోవచ్చని పేర్కొంది. అయితే టీడీపీ నాయకులు ఇవేమీ పట్టించుకోకుండా అక్రమంగా చెరువుమట్టిని లారీల్లో తరలిస్తున్నారు. పచ్చనేతలంటే హడల్..! ఒంటిమిట్ట–దర్జిపల్లె రహదారిలో గంగపేరూరు చెరువు కింద 441 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు మట్టిపై అధికారపార్టీకి చెందిన ఓ నేత కన్నుపడింది. చెరువులోని మట్టి నాణ్యమైనది కావడంతో ఎడాపెడా చెరువును తవ్వేస్తున్నారు. కళ్లముందే పరిస్థితి కనిపిస్తున్నా సంబంధిత అధికారులు మిన్నకుండిపోతున్నారు. రెవెన్యూ, పోలీసు, మైనర్ ఇరిగేషన్ అధికారులకు విషయం తెలిసినప్పటికీ పచ్చనేతల జోలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. అడ్డుకుంటే అక్రమ కేసులు.. గంగపేరూరు చెరువు మట్టిని తరలించడాన్ని అడ్డుకుంటుంటే తమపై అక్రమకేసులు పెట్టి వేధిస్తామని తెలుగు తమ్ముళ్లు భయపెడుతున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇటీవల ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు మట్టి తరలింపుపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అధికారపార్టీ నాయకుడు వారిపై ఎస్టీ, ఎస్టీ కేసు పెట్టించారు. పట్టించుకునేవారెవరు..? గంగపేరూరు చెరువులో యంత్రాలు పెట్టి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకునేవారే లేరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ రవాణాతో ఇప్పటికే చెరువులో పెద్ద, పెద్ద గుంతలు పడ్డాయి. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడుకాకుండా మట్టి తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలలో కడప, భాకరాపేట తదితర ప్రాంతాలలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చెరువులో మట్టి తరలింపును రెవెన్యూ అధికారులు పరిశీలించి వెళుతున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. -
శివధనుర్భాణాలంకారంలో కోదండరాముడు
– భక్తులతో పొటెత్తిన రామాలయం – ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శిధనుర్భాణాలంకారంలో ఒంటిమిట్ట కోదండరామడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివార్లు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. భజన బృందాలతో నృత్యాలు, కోలాటాలు మాఢవీధుల్లో అంగరంగవైభవంగా ఊరేగింపు కొనసాగింది. మరో వైపు భక్తులతో రామాలయం కిటకిటలాడింది. ఉదయం 4.30గంటల వరకు సుప్రభాతం, అనంతరం ఆలయశుద్ధి, ఆరాధన నిర్వహించారు. 7గంటల వరకు సర్వదర్శనం, ఆపై శుద్ధి, మొదటిగంట, మళ్లీ సర్వదర్శనం కల్పించారు. ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం..: కళ్యాణోత్సవం జరిగే ముందు రామాలయంలో ఎదుర్కొలు ఉత్సవం నిర్వహించారు. రామాలయంలోపలి ఉత్తరం వైపు మంటంపంలో సీతా, రామస్వామివార్లు ఎదురెదురుగా ఉంచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం చూడటానికిభక్తులు పోటీపడ్డారు. ఆలయ సంప్రదాయాల రీతిలో ఎదుర్కొలు ఉత్సవాన్ని తర తరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే రీతిలో సోమవారం రాత్రి కూడా ఎదుర్కోలు నిర్వహించారు. వైభవంగా తిరువంజనం..: ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కన్నులపండవుగా నిర్వహించారు. 11గంటల నుంచి 11.30గంటల వరకు శుద్ధి, రెండవగంట, 11.30గంటల నుంచి సాయంత్ర 6 వరకు సర్వదర్శనంకు అనుమతిచ్చారు. 5గంటల నుంచి 6గంటల వరకు కాంతకోరిక, 6గంటల నుంచి 2.30గంటల వరకు శుద్ధి, మూడవగంట మోగ్రించారు. -
నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం
-
నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం!
అంగరంగ వైభవంగా ముస్తాబైన కళ్యాణవేదిక ఒంటిమిట్ట (వైఎస్సార్ జిల్లా): ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించే రాములోరి కల్యాణవేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ముఖద్వారాన్ని భారీసెట్టింగులతో ఏర్పాటుచేశారు. సాంప్రదాయబద్దంగా ఏర్పాటుచేసిన ఈ సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కల్యాణవేదిక లోపలిభాగంలో కళ్యాణం వీక్షించేందుకు పెద్దపెద్ద ఎల్ఈడీలను ఏర్పాటుచేశారు. కల్యాణవేదిక సమీపంలో ప్రముఖులతోపాటు గవర్నర్, సీఎం కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. కళ్యాణవేదిక ప్రాంగణమంతా దేవతామూర్తుల విద్యుత్‌దీపాలు, భారీలైట్లను ఏర్పాటుచేశారు. దాదాపు 70వేల మంది స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి అనుకూలంగా ఏర్పాటుచేశారు. కళ్యాణోత్సవంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యలరావు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఆలయ సంప్రదాయబద్దంగానే.. తరతరాలుగా వస్తున్న ఆలయ సంప్రదాయబద్దంగానే రాములోరి కల్యాణం నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల పగలు సీతారామకళ్యాణం జరుగుతోంది. కానీ ఒక్క ఒంటిమిట్టలో పండువెన్నలలో రాములోరి కల్యాణం నిర్వహించడం కొనసాగుతోంది. ఇదే సంప్రదాయంలో టీటీడీ కూడా రాములోరి కళ్యాణంకు ఏర్పాటుచేసింది. కల్యాణం ముందు రామాలయంలో ఎదుర్కోలు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఉత్సవ మూర్తులను కల్యాణవేదిక వద్దకు తీసుకొస్తారు. వైఖానస ఆగమశాస్త్రమ ప్రకారం స్వామి వారి కళ్యాణోత్సవంను టీటీడీ అర్చకస్వాములు చేపట్టనున్నారు. రాముడు రామచంద్రుడైన వేళ.... శ్రీరామ నవమి పండుగ సందర్బంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ శ్రీ రామాలయాలలోనూ ఇదే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. కానీ ఒంటిమట్ట శ్రీ కోదండరాముని కల్యాణోత్సవానికి మాత్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేని విశిష్ఠత ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్బంగా చైత్ర శుద్ద చతుర్దశి నాడు అది కూడా రాత్రి పూట మాత్రమే కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. దీని వెనుక ప్రచారంలో గల పురాణ, చారిత్రక విశేషాలను ఓసారి గమనిద్దాం! పురాణ గాథ..... శ్రీరాముని జననం పగలు జరిగింది. దీన్ని తిలకించలేకపోయానని చంద్రుడు బాధపడ్డాడు. శ్రీకృష్ణవతారంలో తన జన్మను తిలకించే అవకాశం ప్రసాదిస్తానని రాముడు చంద్రునికి వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన రామచంద్రుడయ్యాడు. శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అద్బుత దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణాన్ని తిలకించే భాగ్యాన్ని ప్రసాదిస్తానని కూడా మాట ఇచ్చాడు. రాముడు ఈ మాటలను నిలుపుకున్నాడు. చారిత్రక గాథ వాల్మీకి రామాయణం ప్రకారం చైత్ర మాసం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పగటిపూట శ్రీరాముని కల్యాణం జరిగింది. ఒంటిమిట్టలో బుక్కరాయులు స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. రామాయణంలోని శ్రీరామ కల్యాణం జరిగిన నక్షత్రం ప్రకారమే ఒంటిమిట్టలో కూడా వివాహం నిర్ణయించారు. అప్పట్లో అది రాత్రి పూట వచ్చింది. ఆ సంప్రదాయాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. బుక్కరాయులు చంద్ర వంశానికి చెందిన వాడు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీరామ కల్యాణం నిర్వహించిన సంతోషం పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించాడు. రామాలయంకు చేరిన గోటితో వలిచిన కోటి తలంబ్రాలు.. ఒంటిమిట్ట రామాలయంకు గోటితో వలిచిన కోటి తలంబ్రాలును ఆదివారం రామాలయం అధికారులకు అందచేశారు. గత మూడు సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణచైతన్య సంఘం భక్త బృందం కళ్యాణం అప్పారావు, చింతామణి, కె.సతీష్ ఆధ్వర్యంలో గోటితో రామనామస్మరణతో వడ్లను వలచి వారు చేసిన 20లక్షల తలంబ్రాలును తీసుకొచ్చారు. వీటిని ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవచార్యులకు అందచేశారు. గత నాలుగు నెలల ఈ కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు. 200 మందితో స్వామివారిపై భక్తితో తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసామన్నారు. రామనామస్మరణ కలిగిన గింజలను తలంబ్రాలలో వినియోగించేందుకు పూజలు కూడా నిర్వహించారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు.. కల్యాణోత్సవంకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు..సౌకర్యాలను కల్పించారు. ప్రసాదాలను పంపిణీ చేసేందుకు విస్తృతంగా కౌంటర్లను ఏర్పాటుచేశారు. కల్యాణం వేదిక ఎదరుగా ఉన్న అత్యా«ధునిక షెడ్లు, పక్క ఇరువైపుల షెడ్లు ఏర్పాటుచేయడం జరిగింది. అలాగే యాత్రీకులు వసతి సముదాయ మండపంను కూడా ప్రారంభించేందుకు సున్నహాలు చేస్తున్నారు. కల్యాణవేదిక వద్ద గవర్నరు, మంత్రులు వెళ్లేందుకు ప్రత్యేకమార్గాలను ఏర్పాటుచేశారు. రోడ్డుపై కల్యాక్యణవేదిక ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా వివిధ అలంకరణలు చేపట్టారు. కళ్యాణం వీక్షించేందుకు ఎల్ఈడీలను ఏర్పాటుచేశారు. రాములోరి కల్యాణానికి తరలిరండి సోమవారం ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాములోరి కల్యాణానికి భక్తులందరూ తరలిరావాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మెన్ క్రిష్ణమూర్తి, జేఈఓ పోలాభాస్కర్లు పిలుపునిచ్చారు. కళ్యాణానికి ముఖ్యమంత్రి, గవర్నర్లతోపాటు రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారని వివరించారు. అదేవిధంగా ఇప్పటికే రాములోరి కళ్యాణవేదికను సుందరంగా ముస్తాబుచేశామన్నారు. వచ్చిన భక్తాదులకు ప్రసాదాలు పంపిణీ అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఏప్రిల్ చివరినాటికి ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించిన కేంద్రపురావస్తుశాఖ అనుమతులుకూడా వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కల్యాణోత్సవ సందర్బంగా భారీ బందోబస్తు జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ కోందడరామస్వామి కల్యాణోత్సవ సందర్బంగా ఈనెల 10వ తేదిన సోమవారం మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎస్పీ చెప్పారు. ఈనెల 10న కల్యాణోత్సవ సందర్బంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కల్యాణోత్సవం ముగిసేవరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ తెలిపారు. కల్యాణ వేదికకు వీవీఐపీ, వీఐపీ పాసులు ఉన్న వారికి ఒక్కొ పాసుకు ఒక్కరికే అనుమతి ఉంటుందని, నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని, అందరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు – వాహనాల దారి మళ్లింపు ► మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరుపతి వైపు నుంచి కడప వైపుకు వచ్చే భారీ వాహనాలు వయా రేణిగుంట, రాయచోటి మీదుగా వెళ్లాలని, అలాగే కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే భారీ వాహనాలు వయా రాయచోటి మీదుగా వెళ్లాలన్నారు. ► తిరుపతినుంచి కడప వైపు వచ్చే ఇతరత్రా వాహనాలు సాయంత్రం 4 గంటల నుంచి సాలాబాద్ క్రాస్ నుంచి మలకాటిపల్లె, సాలాబాద్, రాచపల్లె, సీతానగరం, రాచగుడిపల్లె, ఇబ్రహీంపేట, గంగపేరూరు, పెన్నాపేరూరు, బ్రాహ్మణపల్లి, మోహిద్దీన్సాబ్ పల్లె, ముమ్మిడిగుండుపల్లె, మాధవరం, ఉప్పరపల్లె హైవే రోడ్డుకు చేరుకోవాలన్నారు. ► అలాగే కడప నుంచి తిరుపతికి వెళ్లే ఇతరత్రా వాహనాలు సాయంత్రం 4 గంటల నుంచి మాధవరం, ఉప్పరపల్లె సాయిబాబా గుడి వైపు నుంచి ముమ్మిడి గుండుపల్లె, మోహిద్దీన్సాబ్ పల్లె, బ్రాహ్మణపల్లె, పెన్నపేరూరు, గంగపేరూరు, ఇబ్రహీంపేట, రాచగుడిపల్లె, సీతానగరం, రాచపల్లె, సాలాబాద్, మలకాటిపల్లె మీదుగా సాలాబాద్ క్రాస్ నుంచి వాహనాలు వెళ్లాలని ఎస్పీ సూచించారు. పార్కింగ్ ప్రదేశాలు ► కడప నుంచి వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ ప్రదేశాలుగా కల్యాణ వేదిక పడమర వైపున ఓబుల్‌రెడ్డి వాటర్‌ప్లాంటు, సాయి కాళేశ్వర డిగ్రీ కళాశాల ఎడమవైపున, బ్రహ్మయ్య పెట్రోలు బంకు ఎడమవైపు, ఉప్పరపల్లె వద్దనున్న సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో భక్తలు తమ వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. ► రాజంపేట వైపునుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను హరిత హోటల్, బాయ్స్ హాస్టల్ వద్దనున్న రాముడి గుడి ఎదురుగా ఉన్న ఖాళీ జాగా, సాలాబాద్ క్రాస్ వద్ద, మలకాటిపల్లెలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనే తమ వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు. -
మోహినీ అలంకారంలో జగదభిరాముడు
- రాములోరి కళ్యాణానికి గవర్నర్, మంత్రులు రాక ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం మోహినీ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం వైభవంగా జరిగిన వాహన సేవ అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిగింది. కడప–రేణిగుంట జాతీయ రహదారిపై రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద సోమవారం రాత్రి రాములోరి కల్యాణం నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు కల్యాణోత్సవానికి విచ్చేయనున్నారు. 70 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేసినప్పటికీ ఒంటిమిట్టకు రెండు లక్షల మంది భక్తులు రానున్నట్లు టీటీడీ అంచనా. -
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ సిబ్బంది ఆందోళన
-
ఒంటిమిట్టలో శ్రీరామ నవమి సందడి
-
దాశరధిని దర్శించుకున్న టీటీడీ ఈఓ
ఒంటిమిట్ట(రాజంపేట): టీటీడీ ఈఓ సాంబశివారావు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని సందర్శించారు. శ్రీరామ నవమి బ్రహ్మోత్సలను పురష్కరించుకొని శనివారం ఆయన రామాలయానికి విచ్చేశారు. ముందుగా ఆలయ ప్రధానఅర్చకుడు వీణారాఘవాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. స్వయంగా పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, ఆలయ ఆవరణంలో చలువపందిళ్లు, ఆలయ సంప్రదాయపరంగా నిర్వహించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈవో వెంట జెఈఓ పోలాభాస్కర్, టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా జిల్లా కలెక్టరు సత్యనారాయణ వచ్చిన ఆలయం బయటే వేచివుండాల్సి వచ్చింది. కలెక్టరు ఉన్న విషయాన్ని టీటీడీ అధికారులు విస్మరించడం వల్లనే ఆయన బయటేఉండిపోయారనే వాదన వినిపిస్తోంది. -
ఊపందుకున్న రాములోరి బ్రహ్మోత్సవాల సన్నాహాలు
► ఆలయం సమీపంలో గార్డెనింగ్ ► కళ్యాణవేదిక వద్ద ఏర్పాట్లు ముమ్మరం ఒంటిమిట్ట రామాలయం(రాజంపేట): రెండవ అయోధ్యగా ప్రసిద్ధిచెందిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహోత్సవాల సన్నాహాలు ఊపందుకున్నాయి. పనులను వేగవంతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధిచి తాత్కాలిక పనులే అధికంగా ఉండటం వల్ల పనులు పకడ్బందీగా సకాలంలో పూర్తి చేయాలని ఈఓ సాంబశివరావు ఆదేశించారు. ఉత్సవాలకు ఆలయంతోపాటు కళ్యాణవేదికను ముస్తాబు చేస్తున్నారు. ఆలయం సమీపంలో గార్డెనింగ్: రామాలయం సమీపంలో గార్డెనింగ్ పనులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో కడియం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల పూలమొక్కలను 11రకాల తెప్పించారు. 8,452 మొక్కల నాటి, గార్డెన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ రూ.లక్షలను వ్యయం చేస్తోంది. ఒకొక్కరకం పూలమొక్కలను 500 నుంచి 2500 లోపు తీసుకొచ్చి నాటించే పనిలో పడ్డారు. కళ్యావేదిక సమీపంలో రూ.52లక్షలతో మొక్కలు నాటింపు: కడప రేణిగుంట రహదారిలో తిరుమల తిరుపతి దేవస్ధానం రూ.52లక్షలతో మొక్కలు నాటింపు కార్యక్రమం పూర్తికావచ్చింది. ఈ మొక్కలను మూడు సంవత్సరాల పాటు రక్షించేలా టీటీడీ ప్రణాళికలను రూపొందించుకుంది. ఈ మొక్కలను కళ్యాణవేదిక ప్రాంతంలో కూడా నాటించారు. దీంతో భవిష్యత్తులో కళ్యాణవేదిక పచ్చదనం పరుచుకోనుంది. ఆలయంలో తాత్కలిక షెల్డర్లు..: రామాలయంలోఖాళీగా ఉన్న ప్రాంతంలో తాత్కలిక షెల్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ షెల్డరు వల్ల భక్తులకు నీడ సౌకర్యంతో పాటు ఆలయ నిర్వహణకు సౌకర్యంగా ఉంటుందని భావించి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తులు స్వామివారిని సులభంగా దర్శించుకునేలా ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రూ.34లక్షలతో ముఖద్వారం, ప్రహారీగోడను నిర్మిస్తున్నారు. అలాగే అలంకారమండపం పనులను చేపట్టారు. రథానికి మరమ్మత్తులు..: స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రధోత్సవం నాడు సీతారామలక్ష్మణ స్వామివార్లను ఊరేగించేందుకు రథంను టీటీడీ సిద్ధం చేస్తోంది. గతంలో రథోత్సవం నాడు తలెత్తిన లోపాలను సరిద్దుకునేందుకు ఈసారి రథాన్ని సిద్ధం చేస్తున్నారు. రథోత్సవంను మాఢవీధుల్లో తిరిగేందుకు వీలుగా చర్యలను తీసుకుంటున్నారు. -
వేగంగా రాములోరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
► రూ.3 కోట్ల టీటీడీ నిధులతో పనులు ► 70వేల మంది వీక్షించేలా కల్యాణ వేదిక ► పనులు వేగవంతానికి ఈఓ ఆదేశాలు ► గతంలో జరిగిన లోపాలు సరిదిద్దుకునేనా? రాష్ట్రంలో రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టపై టీటీడీ అధి కారులు ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల ను వైభవంగా నిర్వహించాలని, అం దుకోసం ముందస్తుగా అన్ని ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇప్పటికే కల్యాణ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. కల్యాణోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్న దృష్ట్య తగిన ఏర్పాట్లు చేయడంలో ముందుండాలని టీటీడీ ఈఓ అధికారులకు ఆదేశించారు. ఒంటిమిట్ట్ట రామాలయం(రాజంపేట): వచ్చేనెల 4 నుంచి 14 వరకు జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం ఒంటిమిట్టపై దృష్టి సారించింది. బ్రహ్మోత్సవాల పనుల వేగవంతానికి సంబంధించి ఆయా శాఖల అధికారులకు టీటీడీ ఈఓ సాంబశివరావు ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు టీటీడీ ఏడీ బిల్డింగ్‌లోని ఈఓ అధికారులతో రాములోరి కల్యాణోత్సవం..ఆన్‌గోయింగ్ పనులు, ఉత్సవ విడిది, గార్డెనింగ్, కల్యాణవేదిక అభివృద్ధి అంశాల పురోగతిపై సమీక్షించారు. 70 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు: వచ్చేనెల 10న జరిగే రాములోరి కల్యాణానికి టీటీడీ భారీ సన్నహాలే చేస్తోంది. 70 ఎకరాల స్థలంలో కడప–రేణిగుంట రహదారి వెంబడి వివిధ రకాల మొక్కలను నాటారు. కల్యాణవేదిక వద్ద చదును పనులు పూర్తి చేశారు. 70వేల మందికిపై భక్తులు వీక్షించడానికి అనుకూలంగా ఆధునికమైన పద్ధతిలో చలువపందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కల్యాణ వేదికను రూపొందిస్తున్నారు. రామాలయం చుట్టూ హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణానికి తరలిరానున్న సీఎం, గవర్నరు: రాములోరి కల్యాణానికి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, గవర్నరు నరసింహన్‌తోపాటు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు తరలివచ్చేందుకు అవకాశాలు ఉండటంతో ఆ దిశగా టీటీడీ అవసరమైన ఏర్పాట్లుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. విడిది, వసతి సౌకర్యాలను కల్పించేందుకు టీటీడీ ముందుగానే సమాయత్తమవుతోంది. యాత్రీకుల కోసం విడిది సముదాయ భవనం: కోదండరాముని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, యాత్రీకులు, పర్యాటకుల కోసం రూ.5కోట్లతో యాత్రీకులు విడిది సముదాయభవనం నిర్మిస్తున్నారు. దేవుని మాన్యంలో ఈ భవనం నిర్మాణం పూర్తికావస్తోంది. ఈ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ భవనం మొదటి అంతస్తులో 8 గదులు, మీల్స్ హాల్, రెండవ అంతస్తులో 7 గదులను వందమంది యాత్రీకులు విశాంత్రి తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మూడవ అంతస్తులో ఏడు గదులను నిర్మిస్తున్నారు. వివిధ స్టోరేజి కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గత సంవత్సరం నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటచేసుకున్న పొరపాట్లను టీటీడీ సరిదిద్దుకునేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సరైన రీతిలో భోజన వసతి కల్పించలేదు. ఆర్టీసీ బస్సులను ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేయలేదు. ఎంతో మంది భక్తులు కల్యాణం చూడలేక వెనుదిరిగారు. భక్తులు మరుగుదొడ్లు, మంచినీటి వసతి పుష్కలంగా కల్పించలేకపోయారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ఖాకీలకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం పోలీసువర్గాలు పెదవి విరిచాయి. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీటీడీ ముందుస్తు ప్రణాళికతో ముందుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏమేరకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే. -
న్యాయవాదుల ధర్నాలో ఉద్రిక్తత
హైదరాబాద్: మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సంఘీభావం తెలపడానికి బయలుదేరిన న్యాయవాదుల బృందాన్ని ఒంటిమిట్ట వద్ద ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో న్యాయవాదులు అక్కడే ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయవాదులను ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ వాహనం న్యాయవాదులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్‌బాబు అనే హైకోర్టు న్యాయవాది కాలు విరిగింది. దీంతో న్యాయవాదులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. -
ఒంటిమిట్టలో ఘనంగా చక్రస్నానం
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయ కోనేరు వద్ద శనివారం ఉదయం అర్చకులు ఘనంగా చక్రస్నానం నిర్వహించారు. ఆలయం నుంచి సుదర్శన చక్రాన్ని కోనేరు వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అభిషేక కార్యక్రమం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. -
ఒంటిమిట్టలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కడప: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కోదండ రామాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయాన్నంతటినీ సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేయనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 15 న ధ్వజారోహణం, 20 న కల్యాణం, 21 రథోత్సవం జరుపుతారు. కాగా కోదండ రామాలయానికి టీటీడీ, జిల్లా అధికారులు రానున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి , టీటీడీ ఈఓ సాంబశివరావు, కలెక్టర్ కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాటి, ఇతర జిల్లా అధికారులు హాజరుకానున్నారు. కోదండరాముని బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. -
రామాలయంలో అగ్నిప్రమాదం
ఒంటిమిట్ట (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. ఆలయంలో నీడ కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్ల సమీపంలో విద్యుదాఘాతం సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో భక్తులు గందరగోళానికి గురై పరుగులు తీశారు. అనంతరం తేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణం!
-
ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలు ప్రారంభం
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజు ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, రాత్రి శ్రీరామ జయంతి, శేష వాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.