ఒంటిమిట్ట ఘటనపై తమిళ సంఘాలు ఫైర్‌..

tamil human rights groups fires on andhra police on vontimitta issue - Sakshi

సాక్షి, చెన్నై: వైఎస్సార్‌ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాల లభ్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తమిళ కూలీల మృతదేహాలను తమిళనాడు పోలీసులకు అప్పగించారు. అయితే వారి మరణం పై తమిళ మానవ హక్కుల సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ తమిళ మానవ హక్కుల సంఘాలు మృతదేహాలను పరిశీలించాయి.  అయితే మానవ హక్కుల సంఘాలు పోలీసులను తీవ్రంగా విమర్శించాయి. ఇది ఆంధ్రా పోలీసులు చేసిన హత్యలే అని తమిళ సంఘాలు ఆరోపించాయి.

ఈ విషయంపై తమిళనాడు పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం మృతదేహాలను తీసుకెళ్ళుతున్నాం. మా ప్రభుత్వం ఆదేశాల మేరకు భవిష్యత్‌లో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. 

3లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం..
ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన కుటుంబాలను అదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అంతేకాక చనిపోయిన వారికి ఒక్కొక్కరికి మూడు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని తమిళ ప్రభుత్వం ప్రకటించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top