ఒంటిమిట్టలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | kondanda rama brahmostavam in vontimitta | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Apr 12 2016 11:07 AM | Updated on Sep 3 2017 9:47 PM

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కోదండ రామాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

కడప: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కోదండ రామాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయాన్నంతటినీ సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేయనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 15 న ధ్వజారోహణం, 20 న కల్యాణం, 21 రథోత్సవం జరుపుతారు.

కాగా కోదండ రామాలయానికి టీటీడీ, జిల్లా అధికారులు రానున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి , టీటీడీ ఈఓ సాంబశివరావు, కలెక్టర్ కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాటి, ఇతర జిల్లా అధికారులు హాజరుకానున్నారు. కోదండరాముని బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement