రామాలయంలో అగ్నిప్రమాదం | Fire accident in Ramalayam | Sakshi
Sakshi News home page

రామాలయంలో అగ్నిప్రమాదం

Dec 21 2015 2:59 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. ఆలయంలో నీడ కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి.

ఒంటిమిట్ట (వైఎస్సార్‌ జిల్లా) : ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. ఆలయంలో నీడ కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

వైకుంఠ ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్ల సమీపంలో విద్యుదాఘాతం  సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో భక్తులు గందరగోళానికి గురై పరుగులు తీశారు. అనంతరం తేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement