
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్ రాజ్యమేలింది. నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు యథేచ్చగా దొంగ ఓట్లు గుద్దుకున్నారు. క్యూలో దర్జాగా రకరకాల ఫోజులతో నిలబడి మరీ ఓట్లు వేశారంటూ ఇవాళ మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ఆ విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో..
కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎదురుగానే దొంగ ఓట్లుపడ్డ సంగతిని వైఎస్ జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకు సంబంధిత దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారాయి. అయితే ఫోటోలో ఉన్నది దొంగ ఓటర్లని బహిర్గతం కావడంతో కలెక్టర్ కంగుతిన్నారేమో..! దీంతో అప్పటికే ఆ ఫోటోలను తన ఎక్స్‌లో పోస్ట్ చేసిన జిల్లా కలెక్టర్ వెంటనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
