
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు పులివెందులకు చేరుకున్నారు. ఈ మేరకు పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌ను చూసేందుకు అభిమాన సంద్రం పోటెత్తింది. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బర్ నిర్వహించారు. వైఎస్ జగన్‌కు తమ సమస్యలు విన్నవించారు ప్రజలు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్.. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
ఈ రోజు స్థానిక ప్రజలతో పాటు, నాయకులను వైఎస్ జగన్ కలిశారు.. రేపు(జూలై 8) వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు..
