
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా ఎస్పీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేయగా.. డీజేలకు అనుమతి కోరితే ఊరుకునేది లేదంటూ.. మీ అనుమతులు మాకు అక్కర్లేదంటూ శ్రీనివాసులురెడ్డి హుకుం జారీ చేశారు. డీజేలకు అనుమతులు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా.. అలా తీసుకోవడం కుదరదంటూ ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వినాయక చవితి పందిళ్లు, డీజే మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనసరి అని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీరు ఆంక్షలు పెట్టడం ఏంటంటూ శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వ నిబంధనలను కూడా అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఏడాదీ ఉత్సవ నిర్వాహకులు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతి ప్రకారం కావాల్సిన భద్రతను పోలీస్‌శాఖ కల్పిస్తోంది. కానీ అనుమతులు తీసుకోవాలంటే.. ఊరుకునేది లేదంటూ శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్ పెట్టారు.