వైఎస్సార్‌ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ కక్షసాధింపు చర్యలు | TDP Revenge Politics On YSRCP In YSR DIstrict | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ కక్షసాధింపు చర్యలు

Jun 26 2025 9:50 PM | Updated on Jun 26 2025 9:58 PM

TDP Revenge Politics On YSRCP In YSR DIstrict

వైఎస్సార్‌ జిల్లా:  జిల్లాలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి.  బద్వేల్‌ మండలం బయనపల్లిలో విద్యార్థి విభాగం  జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ అధికారులు యత్నిస్తున్నారు. రాత్రి సమయంలో అక్కడకు చేరుకుని ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. 

చెరువు ల్యాండ్‌లో ఇల్లు నిర్మించారని ఆరోపిస్తూ.. ఆ ఇంటిని కూలగొట్టేందుకు రాత్రి సమయంలో అధికారులు రావడంతో ఇది సరైన చర్య కాదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నోటీసు ఇవ్వకుండా ఇల్లును ఎలా కూలుస్తారంటూ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement