
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ స్కూటీ పేలి మహిళ మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో తెల్లవారుజామున ఇంటి ఆవరణంలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూటీ పేలిపోయింది. పక్కనే సోఫాలో నిద్రిస్తున్న ఉండేలా వెంకటలక్ష్మమ్మ(62) మంటల్లో కాలిపోయింది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎలక్ట్రిక్ స్కూటర్లు బాంబుల్లా పేలిపోతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. బ్యాటరీలు కారణంగానే బ్లాస్ట్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ నిర్వహణ సరిగా చేయకపోవడం, ఛార్జింగ్ పెట్టడంలో తప్పుడు పద్ధతులు కారణంగా బ్యాటరీలు పేలతాయని అంటున్నారు.